ఎంపీగా రేవంత్ రెడ్డి: మహబూబ్ నగర్ నుంచి పోటీ 

  • Publish Date - January 27, 2019 / 10:04 AM IST

మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులే పరాజయం పాలయ్యారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని పార్లమెంట్  ఎన్నికల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు  తెలుస్తోంది.

 
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధుల ఎంపకిపై దృష్టి సారించాయి.భారతీయజనతా పార్టీ త్వరలో  చేవెళ్ల, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ అభ్యర్ధులను ప్రకటించే  అవకాశం ఉంది.  ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయనున్నారు.