Pothina Mahesh : జనసేన నేత పోతిన మహేశ్‌కు షాక్..!

బీసీ సామాజికవర్గానికి చెందిన అడ్డూరి శ్రీరామ్, గోలగాని రవిక్రిష్ణ టికెట్ ఆశిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన పోలిశెట్టి రవికుమార్ కూడా విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Pothina Mahesh : జనసేన నేత పోతిన మహేశ్‌కు షాక్..!

Updated On : March 15, 2024 / 8:46 PM IST

Pothina Mahesh : విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ వీడింది. ఆ సీటును బీజేపీకి కేటాయించాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటివరకు విజయవాడ వెస్ట్ టికెట్ ను జనసేనకే కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జనసేన తరుపున పోతిన మహేశ్ పోటీకి సిద్ధమయ్యారు. కానీ, ఆ సీటుని పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోయింది. బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై అన్వేషణ మొదలుపెట్టింది.

విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ నుంచి ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన అడ్డూరి శ్రీరామ్, గోలగాని రవిక్రిష్ణ టికెట్ ఆశిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన పోలిశెట్టి రవికుమార్ కూడా విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి ఒకటి రెండు రోజుల్లో విజయవాడ వెస్ట్ అభ్యర్థిపై క్లారిటీ రానుంది.

Also Read : పవన్ కల్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ప్లాన్.. హాట్ హాట్‌గా పిఠాపురం పాలిటిక్స్