బీజేపీ బలపడుతోంది : వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు

బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ బలపడుతోందని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 09:38 AM IST
బీజేపీ బలపడుతోంది : వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు

Updated On : November 21, 2019 / 9:38 AM IST

బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ బలపడుతోందని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని

బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ బలపడుతోందని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఇతర పార్టీల నాయకులు కూడా టచ్ లో ఉన్నారని వెల్లడించారు. ఏపీలో కుల రాజకీయాలు ఉన్నాయని కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం జగన్ ఇంకా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు.

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పైనా సోము వీర్రాజు స్పందించారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పేందుకు సిబ్బంది ఉన్నారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ మీడియంలో చదువుకోవాలి అనే ఆప్షన్ తల్లిదండ్రులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిల్లలపై బలవంతంగా ఇంగ్లీష్ మీడియం చదువులు రుద్దకూడదని హితవు పలికారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలుగు భాషను తీసేసే హక్కు ఎవ్వరికీ లేదన్నారాయన. 

మతపరమైన విధానంలో చంద్రబాబుకి, జగన్ కి తేడా లేదని సోము వీర్రాజు అన్నారు. టీడీపీ, వైసీపీవి ఓటు బ్యాంకు రాజకీయాలు అని విమర్శించారు. పాస్టర్లు, ఇమామ్ లకు జీతాలు ఇస్తామని చంద్రబాబు, జగన్ చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకం అని స్పష్టం చేశారు.