సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి : మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ స్పందించింది. ఇంత తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ లీడర్స్. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కాంగ్రెస్ నేతలు కలిశారు.
మర్రి శశిధర్ రెడ్డి : –
ఇష్టానుసారంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటూ కంప్లయింట్ చేశారు. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని కమిషనర్‌ను కోరినట్లు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
జగ్గారెడ్డి : –
ఇదిలా ఉంటే..కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భిన్నంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నిలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారాయన. అలాగే..కమిషనర్‌పై పలు విమర్శలు గుప్పించారు. నాగిరెడ్డది ఎన్నికల సంఘం అధికారా ? లేక టీఆర్ఎస్ కార్యకర్తనా ? అంటూ ప్రశ్నించారు.
ఈసీ, పోలీసులు టీఆర్ఎస్‌ను కాపాడుతున్నారని విమర్శించారు. ముందు ఎన్నికల ఓటర్ లిస్టును ప్రకటించాలని, అనుమానాల నివృత్తికి వారం గడువు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు మిస్ అయితే..బాధ్యులెవరూ అని నిలదీశారు.
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ను 2019, డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే.
* 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు.
* 2020, జనవరి 07వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.
* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 10 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు.
* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.
* 2020, జనవరి 22న పోలింగ్.
* 2020, జనవరి 25న కౌంటింగ్.
* 2020, జనవరి 24 (రీ పోలింగ్ వస్తే)