Gold Man Hari Nadar : ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన గోల్ట్ మ్యాన్

Gold Man Hari Nadar : ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన గోల్ట్ మ్యాన్

Gold Nomination As Indipendent

Updated On : March 17, 2021 / 1:46 PM IST

Gold Man Hari Nadar files nominaition papers wearing 5kg Gold Jewellerry : ఎన్నికలొచ్చాయంటే నామినేషన్లు, ప్రచారాలు, హడావిడి అంతా ఇంతా ఉండదు. నామినేషన్లు వేసే అభ్యర్ధులు తమ ఆస్తులు-అప్పుల వివరాలు కూడా అందులో పొందుపరుస్తారు. ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన మొత్తం ఆస్తుల విలువ రూ.54 లక్షలుగా పేర్కోన్నారు. కొంతమంది నాయకులు ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చే ఆస్తులు చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటారు అప్పుడప్పుడు. తమిళనాడులో గోల్ట్ మ్యాన్ గా పేరు పొందిన హరినాడార్ ఇటీవల నామినేషన్ వేయటానికి వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

 

Gold Man Hari Nadar

 

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అలంగుళమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న హరినాడార్ తన వంటిపై 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి నామినేషన్ వేయటానికి వచ్చాడు. హరి నాడార్ ను చూసి స్ధానికులే కాక రిటర్నింగ్ అధికారులు సైతం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.అపిడవిట్ లో తన వద్ద 11.2 కిలోల బంగారం ఉందని పేర్కోన్నాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Vanitha Vijay Goldman

Vanitha Vijay Goldman

కాగా…. హరినాడార్ హీరోగా ఇటీవల 2K అజగనథు కాదల్ అనే సినిమాను కూడా నిర్నిస్తున్నాడు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 28న చెన్నైలోని ఏవీయం స్టూడియోలో జరిగాయి.

Vanitha Harinadar

Vanitha Harinadar

అందులో వనితా విజయకుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళనాడులోబలమైన సామాజిక వర్గం ఉన్న నాడార్ వర్గం బలోపేతం కావచం కోసం నాడార్ పెరవై పేరుతో కూడా పోరాడుతున్నాడు. హరినాడార్ గతంలో పవన్ గట్టు పాడై అనే రాజకీయ పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేశాడు.