లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. టికెట్లపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

Telangana Congress Lok Sabha Candidates

Telangana Congress Lok Sabha Candidates : లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ రెడీ అవుతోంది. తెలంగాణలోని 17 స్థానాలకు 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికై కసరత్తు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులపై 10టీవీ ప్రత్యేక విశ్లేషణ..

లోక్ సభ సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మహబూబ్ నగర్ స్థానం నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ ప్రకటించేశారు. సీఎం తన సొంత గడ్డ పైనుంచి చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఊపు కనిపిస్తోంది. ఇప్పటికే లోక్ సభ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్.. ఆ తర్వాతి ప్రక్రియలు అన్నింటినీ పక్కన పెట్టి.. తొలి అభ్యర్థిని ప్రకటించింది.

కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ వంటివి పూర్తి స్థాయిలో కసరత్తు చేయక ముందే మహబూబ్ నగర్ రేసు గుర్రాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. టికెట్లపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా.. సందర్భాన్ని బట్టి ఎవరు ఎక్కడి అభ్యర్థులో చెప్పేయాలని భావిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులు.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్చ తీసుకుని అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇంతకీ.. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు ఎవరు? ఎవరికి ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ లభించనుంది? 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు వీళ్లే?
చేవెళ్ల- పట్నం సునీతారెడ్డి(వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్)
సికింద్రాబాద్- బొంతు రామ్మోహన్ (మాజీ మేయర్)
మెదక్- మైనంపల్లి హనుమంతరావు (మాజీ ఎమ్మెల్యే)
జహీరాబాద్ – సురేశ్ షెట్కార్ (మాజీ ఎంపీ)
నిజామాబాద్ – జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
ఆదిలాబాద్ – రేఖా నాయక్ (మాజీ ఎమ్మెల్యే)
మహబూబాబాద్ – బలరాం నాయక్(కేంద్ర మాజీ మంత్రి)
వరంగల్ – అద్దంకి దయాకర్
పెద్దపల్లి – వెంకటేశ్ నేత (సిట్టింగ్ ఎంపీ)
మల్కాజ్ గిరి – కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (అల్లు అర్జున్ మామ)

ఖమ్మం – పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా మల్లు నందిని
హైదరాబాద్ – సమీర్ ఉల్లా(మైనార్టీ నేత)
నాగర్ కర్నూలు – సంపత్ కుమార్ (మాజీ ఎమ్మెల్యే) లేదా మల్లు రవి(కాంగ్రెస్ సీనియర్ నేత)
నల్గొండ – రేసులో జానారెడ్డి (మాజీ మంత్రి), పటేల్ రమేశ్ రెడ్డి
భువనగిరి – రేసులో కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి(డాక్టర్), చామల కిరణ్ కుమార్ రెడ్డి
కరీంనగర్ – రేసులో ప్రవీణ్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), రాజేందర్ రావు
మహబూబ్ నగర్ – చల్లా వంశీ చంద్ రెడ్డి (లోక్ సభ అభ్యర్థి)

Also Read : నీటి పోరు యాత్ర.. మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్‌ఎస్‌!

పూర్తి వివరాలు..