బడ్జెట్2020 : కేసీఆర్ పాలనలో తెలంగాణ నెం1: గవర్నర్ తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ప్రారంభమైన సభలో..తొలుత గవర్నర్ తమిళిసై ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఉద్యమ నేతనే తెలంగాణ సీఎంగా ఉన్నారని, ఆయన పాలనలో తెలంగాణ అభివృద్ధి బాటలో వెళుతోందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చెరువులను నిర్లక్ష్యం చేశారని, విద్య, వైద్యం, తాగునీటి సరఫరాను నిర్లక్ష్యం చేశారని సభలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలను నివారించామన్నారు. పెన్షన్లను రూ. 2016కు పెంచామని, తర్వలోనే పెన్షన్ల వయస్సు 57కు తగ్గిస్తామన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. కరెంటు, నీటి సమస్యను అధిగమించినట్లు, సంక్షేమ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు పెన్షన్‌లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, వికలాంగుల పెన్షన్లను రూ. 3 వేలకు పెంచామని, గుర్తు చేశారు. ఒంటరి మహిళలకు సైతం ఆసారా పెన్షన్లు (57 ఏళ్లు పూర్తయిన అందరికీ), వృద్ధాప్య పెన్షన్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గించారన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
ముఖ్యాంశాలు : –
* 950కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్లు నడిపిస్తున్నాం.
* కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, రూ. కిలో బియ్యం అందిస్తున్నాం.
* చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం.
* నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం.
* యాదవులను, నేత కార్మికులను ఆదుకున్నాం.
* గొల్ల, కురుమలకు, సబ్సిడీపై గొర్రెలు, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ.
* ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నాం.
* ముల్లా, మౌజీలకు నెలకు రూ. 5 వేలు ప్రభుత్వం ఇస్తోంది.
* బీడీ కార్మికులకు రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
See More: