ప్రభుత్వానికి కృతజ్ఞతలు – ఆర్టీసీ జేఏసీ

  • Published By: madhu ,Published On : November 29, 2019 / 08:25 AM IST
ప్రభుత్వానికి కృతజ్ఞతలు – ఆర్టీసీ జేఏసీ

Updated On : November 29, 2019 / 8:25 AM IST

ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల జేఏసీ కృతజ్ఞతలు తెలియచేసింది. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశమై..ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించింది. కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని, చనిపోయిన కుటుంసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, తక్షణం రూ. 100 కోట్లు ఆర్టీసీ సంస్థకు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు 2019, నవంబర్ 29వ తేదీ శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 

31 మంది చనిపోవడం దురదృష్టకరమని, వీరందరికీ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. తమ పోరాటానికి సహకరించిన సంఘాలకు, రాజకీయ పార్టీలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో నవంబర్ 30వ తేదీ శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో అపూర్వమైన సమ్మెగా అభివర్ణించారు. మిగతా సమస్యలన్నీ సీఎం కేసీఆర్ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవావలని కోరారు. 

సమ్మెకాలంలో అకాలమరణం చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు, సెప్టెంబర్ మాసానికి చెందిన జీతాలను చెల్లించాలని కోరారు. అయితే..యూనియన్లు రద్దు చేసే అవకాశం ఎవరికీ లేదన్నారు. ట్రేడ్ యూనియన్లు ఉద్యమం చేస్తే..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, యూనియన్లతో చర్చించి..సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. ఉద్యమంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 
Read More : ఆర్టీసీలో యూనియన్లకు చెక్ : టీఎంయూ ఆఫీసుకు తాళం