Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై గుడ్ న్యూస్.. బుధవారమే బిల్లు, ఇంతకీ ఆదివారం చర్చలో ఏం జరిగిందంటే?

మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల వంటి ఎన్నికైన సంస్థలలో మహిళా రిజర్వేషన్‌ను గట్టిగా సమర్థించారు

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై గుడ్ న్యూస్.. బుధవారమే బిల్లు, ఇంతకీ ఆదివారం చర్చలో ఏం జరిగిందంటే?

Parliament Special Session: మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకురావచ్చు. సోమవారం నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే మహిళా రిజర్వేషన్‌ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై ప్రతిపక్ష నేతలు కూడా సముఖంగానే ఉన్నట్లు, ఈ బిల్లు సులభంగా పార్లమెంట్ ఆమోదం పొందుతుందని తెలుస్తోంది.

వాస్తవానికి సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతిపక్ష కూటమి ఇండియా సహా ఎన్డీయే నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చ జరిగింది. దీనికి ఇటు అధికార పక్షం నేతలు, అటు విపక్ష నేతలు అందరూ సముఖత వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఈ బిల్లును చాలా తేలికగా పార్లమెంటు ఆమోదించవచ్చని స్పష్టమైంది.

Modi Praises Nehru and Indira: నెహ్రూ, ఇందిరా గాంధీలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల వంటి ఎన్నికైన సంస్థలలో మహిళా రిజర్వేషన్‌ను గట్టిగా సమర్థించారు. కాగా, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మహిళా రిజర్వేషన్ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం పొందగానే రాజ్యసభకు పంపుతారు.

కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల నుంచి మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. దీనిపై బీజేపీ, ఎన్సీపీ వంటి మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో తమకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్‌ కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చిన సందర్భంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

Parliament Special Sessions 2023 : కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులపై ఉత్కంఠ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఎంసీ కూడా మద్దతిస్తున్నట్లు కనిపించింది. బీజేపీలో పెద్ద సంఖ్యలో మహిళా ఎంపిలను కూడా ప్రస్తావించింది. అయితే ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రస్తావిస్తూనే.. వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ కులాల మహిళలకు రిజర్వేషన్లలో కోటాను నిర్ణయించే అంశాన్ని కూడా లేవనెత్తాయి.