ఎందుకిలా : వైసీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వాయిదా

మార్చి 13వ తేదీన ఫస్ట్ జాబితా రిలీజ్ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే...వివిధ పార్టీల

  • Publish Date - March 13, 2019 / 05:46 AM IST

మార్చి 13వ తేదీన ఫస్ట్ జాబితా రిలీజ్ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే…వివిధ పార్టీల

వైసీపీ ఎమ్మెల్యేల తొలి జాబితాకు బ్రేక్ పడింది. మార్చి 13వ తేదీ బుధవారం రిలీజ్ అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. దీనితో ఎవరికి టికెట్లు దక్కుతుందో ..దక్కదోనని నేతలు ఫుల్ టెన్షన్ పడ్డారు. అయితే తొలి జాబితా విడుదల చేయడం లేదని వైసీపీ ప్రకటించింది.  సిట్టింగుల్లో కొందరిపై వేటు వేయడంతోపాటు పాత కొత్త కలయికతో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీ సీట్ల కోసం పార్టీలో పెద్దగా పోటీ లేకపోవడంతో.. ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు జగన్. 
Read Also : ఆ నలుగురు ఎవరు : TRS సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్ ?

ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అభ్యర్థుల జాబితా రెడీ చేసేందుకు ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా ఉన్న వైసీపీ.. అభ్యర్థుల జాబితాపై భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. కొన్ని రోజులుగా పార్టీ అధ్యక్షుడు జగన్ సుదీర్ఘంగా దీనిపై కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మార్చి 13వ తేదీన ఫస్ట్ జాబితా రిలీజ్ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే…వివిధ పార్టీల నుండి వలసలు ఎక్కువవుతున్నాయి. లోటస్ పాండ్‌లో వలస నేతలతో సందడి సందడిగా మారుతోంది. కొత్త చేరికలతో జగన్ కండువాలు కప్పుతూ..వారితో చర్చలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. 
Read Also : టీడీపీ నాకు అన్యాయం చేసింది: వైసీపీలో చేరిన తోట దంపతులు

ఈ సమయంలో జాబితా రిలీజ్ చేయడానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొత్తగా చేరికలుండడంతో జాబితాపై మరోసారి కసరత్తు జరపాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లతో జాబితాపై కూలంకుషంగా జగన్ చర్చిస్తున్నారు. అంతా కసరత్తు పూర్తి చేసి  మార్చి 16వ తేదీ ఉదయం 10.26 నిమిషాలకు రిలీజ్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇడుపులపాయలో ఈ జాబితా విడుదల చేసి ఇక్కడి నుండే జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల లిస్ట్‌ను సిద్ధం చేసిన వైసీపీ విడతలవారీగా జాబితాను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి తొలుత విడుదల చేసే జాబితాలో ఎంతమంది పేర్లు ప్రకటిస్తారో చూడాలి. 
Read Also : ఓటరు జాబితాలో మీ పేరు లేదా.. దరఖాస్తుకు 3 రోజులే