ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో 

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 02:51 AM IST
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో 

Updated On : April 6, 2019 / 2:51 AM IST

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు. నవరత్నాలతోపాటు పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీల ఆధారంగానే మేనిపెస్టోకు తుదిరూపం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను  వైసీపీ విడుదల చేయనుంది. 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులు, వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే మేనిఫెస్టోను రూపొందిస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ అధికారమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ మేనిఫోస్టోను విడుదల చేయడానికి రెడీ అయ్యింది. అమరావతిలోని నూతన గృహంలో పంచాంగ శ్రవణం తర్వాత ఉదయం 10 గంటలకు మేనిఫోస్టోను వైసీపీ అధినేత జగన్.. విడుదల చేయనున్నారు.
Read Also : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం

వైఎస్‌ సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే మేనిఫెస్టో ఉండబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలతోపాటు పాదయాత్రలో జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. పాదయాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీలన్నీ మేనిఫెస్టోలో ఉండనున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పొందుపర్చారు. రాజధాని భూములు, అగ్రిగోల్డ్‌ లాంటి అంశాలు ఉండనున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందనే విషయాన్ని మరోసారి వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు రాజధాని అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను మేనిపోస్టోలో పొందుపర్చినట్టు తెలుస్తోంది.
 
విద్యా, వైద్యం, మహిళలు, రైతులకు వైసీపీ మేనిఫెస్టోలో పెద్దపీట వేసినట్టు సమాచారం. దీంతోపాటు యువతకు ఉపాధి అవకాశాల్లాంటి వాటిపై కచ్చితమైన అంశాలు చేర్చినట్టు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనపై వైసీపీ ఏం చేస్తుందన్న అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్టు సమాచారం. ఐదు లక్షల వార్షికాదాయం ఉన్న వారికి యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌, ప్రైవేట్ స్కూల్స్‌పై ఫీజు నియంత్రణ కమిటీ వేస్తున్నట్టు మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తానికి జనరంజక హామీలను వైసీపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చినట్టు తెలుస్తోంది. నవరత్నాలు, పాదయాత్ర హామీలతోపాటు ప్రజలకు దగ్గరయ్యేందుకు పలు అంశాలతో మేనిఫెస్టో రెడీ అయినట్టు తెలుస్తోంది.
Read Also : చంద్రబాబుకు ఓటేస్తే పాకిస్తాన్ ప్రధానికి ఓటేసినట్లే!