ఒకసారి చూసి మాట్లాడండి- వైఎస్ షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

జగన్ ను 16నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎలా..?

YV Subba Reddy Strong Counter To YS Sharmila

YV Subba Reddy : ఏపీలో అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వ పాలన గురించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ షర్మిల పక్క రాష్ట్రం నుంచి ఏపీ రాష్ట్రానికి వచ్చింది ఈరోజేనని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో ఒకసారి చూసి మాట్లాడాలని హితవు పలికారాయన. అభివృద్ధి అంటే రోడ్లు వేసి, బిల్డింగ్ లు కట్టడం కాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఆయన తేల్చి చెప్పారు. పేదలకు ఏ ఇబ్బందులు లేకుండా చేయడానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీరు వస్తే చూపిస్తాం కూడా అని షర్మిలను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. 2014 నుంచి 19వరకు అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో చంద్రబాబును అడగాలని షర్మిలకు సూచించారు వైవీ సుబ్బారెడ్డి.

Also Read : చంద్రబాబును సీఎం చేయడమే వైఎస్ షర్మిల లక్ష్మంగా కనపడుతోంది- సజ్జల సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్ మెంట్ చేశామో, ఏ విధంగా ఆదాయ వనరులు పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్టులు నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలు పెట్టాం.. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

”రాష్ట్ర అభివృద్ది గురించి షర్మిలకు ఏం తెలుసు? ఆమె ఈరోజే పక్క రాష్ట్రం నుండి వచ్చారు. షర్మిల కాదు ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పే ముందు చూసి మాట్లడాలి. రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాం. మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు. పేదలు సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందుతున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎలా..?

వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిని, జగన్ ను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ పై చార్జ్ షీటు వేసింది. జగన్ ను 16నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిపై చార్జ్ షీట్ వేస్తే 17మంది ఎమ్మెల్యేలు రాజీనామ చేశారు. వాళ్ళకు ఏం సమాధానం చెబుతారు? ఇన్ని ఇబ్బందుల పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టో షర్మిల సమీక్షించుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యామే తప్ప మేము ఎక్కడా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదు. చంద్రబాబు దోచినట్లు రాష్ట్రాన్ని దోచెయ్యలేదు” అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Also Read : ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

”ఎన్ని పార్టీలు అయినా రావొచ్చు. పోరాటానికి మేము సిద్ధమే. మేము చేసినన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని కూడా మేము చాలెంజ్ చేసి చెప్పగలం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వారితో సఖ్యతగా ఉంటాము. పార్లమెంటులో కానీ బయట కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కారణం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే. కేంద్రం సహకారం లేకపోతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాల అమలు చేసే వాళ్లమా? వీటి కోసమే కేంద్రంతో కాంప్రమైజ్ అయ్యాము కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేశాము, అందులో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేయడం కోసం సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇచ్చాము.. ఆ లెక్కలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు దోచుకున్నట్లు ఈ రాష్ట్రాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వమూ, ఏ పార్టీ దోచుకోలేదు. చంద్రబాబును, మా ప్రభుత్వంతో పోల్చడం దారుణం” అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Also Read : ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌పై నిప్పులు