వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ మళ్లీ వాయిదా

  • Publish Date - March 16, 2019 / 02:15 PM IST

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడగా.. ఇవాళ(16మార్చి 2019) సాయంత్రం 5గంటలకు జాబితా విడుదల చేయాలని భావించారు. అయితే జాబితా విడుదల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. ఆదివారం(17మార్చి 2019) ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని దర్శించుకుని అనంతరం జగన్ జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తొలి జాబితాలో 150కి పైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 25 లోక్‌సభ స్థానాలకు గాను 22మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. 
Read Also : టీడీపీ రెండవ జాబితా: పార్లమెంటు అభ్యర్ధులు వీళ్లే!

అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ముగ్గురికి మినహా అందరికీ పోటీకి అవకాశం ఇస్తున్నారని సమాచారం. అలాగే శనివారం రాత్రికి లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, వైఎస్ వివేకానంద హత్య కారణంగా.. శనివారం(16మార్చి 2019) ప్రారంభం కావలసిన జగన్ ప్రచారం ఆదివారానికి వాయిదా పడింది. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.