Adhika Sravana Masam 2023 : ఈరోజు నుంచే అధిక శ్రావణమాసం ప్రారంభం.. ఈ నెలంతా ఈ పనులు అస్సలు చెయొద్దు..
ఆషాఢ మాసం వెళ్లిపోయింది. ఇక శ్రావణమాసం వచ్చేసింది. కానీ ఈ ఏడాది (2023)రెండు శ్రావణమాసాలు రావటం విశేషం. అలా ఈరోజు నుంచి అధిక శ్రావణం ప్రారంభమైంది.

Adhik Sravana Masam starts today
Adhika Sravana Masam starts today : ఆషాఢ మాసం వెళ్లిపోయింది. ఇక శ్రావణమాసం వచ్చేసింది. కానీ ఈ ఏడాది (2023) రెండు శ్రావణమాసాలు రావటం విశేషం. అలా ఈరోజు నుంచి అధిక శ్రావణం ప్రారంభమైంది. ఈ అధిక శ్రావణంలో చేయకూడని పనులు ఉన్నాయని మరి ముఖ్యంగా శుభకార్యాలు వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.
పండుతులు చెప్పినదానికి బట్టి.. శ్రావణ మాసం 19 ఏళ్లకు ఒకసారి వస్తుంది. దీనినే అధిక శ్రావణం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం.. (ఇంగ్లీషుల నెలల ప్రకారంగా చూస్తే) శ్రావణమాసం ‘జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం ఉంటుంది. అంటే ఈరోజు నుంచే అధిక శ్రావణం ప్రారంభమైంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ మాసంలో శివయ్యకు పూజలు చేస్తే మంచి శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడేళ్ల తరువాత అదనపు నెల వస్తుంది. దీనినే అధికమాసం లేదా శూన్య మాసం అని కూడా అంటారు. అలా ఈ అధిక శ్రావణం ఆగస్ట్ 16 వరకూ ఉంటుంది.
Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?
కాబట్టి ఈ శూన్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దని అసలు శుభకార్యలు తలపెట్టవద్దని సూచిస్తున్నారు. అధిక శ్రావణ మాసంలో శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతుంటారు. జులై 18 నుంచి ఆగస్ట్ 16 వరకూ అధిక శ్రావణ మాసం రోజుల్లో చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం..
– వివాహాలు చేసుకోకూడదు..
వివాహ ప్రతీ మనిషి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. అటువంటి వివాహాలను ఈ అధిక శ్రావణంలో చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
– కొత్త షాపుల ప్రారంభోత్సవాల చేయకూడదు.
జీవితంలో పైకి రావటానికి వ్యాపారాలు చేస్తుంటారు. అటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు అధిక మాసంలో చేయకూడదు.
-కొత్త ప్రాజెక్ట్లు, కొత్తగా ఉద్యోగాల్లో చేరడం, భారీ పెట్టుబడులను పెట్టడం చేయొద్దు..
-కొత్త ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు అంటూ భూమి పూజలు చేయవద్దు.
– ఆస్తుల కొనుగోళ్లు చేయవద్దు..
-ఉపనయనం వంటి శుభ కార్యాలు చేయవద్దు..