తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే స్వామి వారి పెదశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

Tirumala Brahmotsavalu 2024 : తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం తిరుమలలో అంకురార్పణ చేశారు. అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఢవీధుల్లో విహరించారు విశ్వక్సేనుల వారు. రేపు సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు జరిగే స్వామి వారి పెదశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Also Read : తిరుమల శ్రీవారికి రోజుకు ఎన్నిసార్లు..? ఏ సమయంలో ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..
తిరుమలలోని సప్తగిరి, విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో సందడిగా మారాయి. రెండు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. తిరుమలలో అంకురార్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు దేవీ నవరాత్రులు, ఇటు శ్రీవారి బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రంగు రంగుల విద్యుత్ దీప కాంతులు, పూల ఆలంకరణలతో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.