సంక్రాంతి రోజు చేయాల్సిన దానాలు.. ఇలాచేస్తే జీవితంలో మీ పంట పండినట్లే..

పాపాలు తొలగిపోయి, ఆత్మ సంతృప్తి, శుభం కలుగుతాయి. సంక్రాంతి రోజున దానాలు చేయాలని పండితులు చెబుతుంటారు.

సంక్రాంతి రోజు చేయాల్సిన దానాలు.. ఇలాచేస్తే జీవితంలో మీ పంట పండినట్లే..

Sankranthi (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 11:28 AM IST
  • మనకు ఉన్నంతలో దానాలు చేయాలి
  • బెల్లం, నల్ల నువ్వులను దానం చేయాలి
  • సూర్యుడు, శనిదేవుని అనుగ్రహం దక్కుతుంది

Sankranti 2026: సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి అనగానే పిండి వంటలు, గాలిపటాలు, కోళ్ల పందేలు, బంధువులే కాదు.. ప్రజలు చేసే దానాలు కూడా గుర్తుకొస్తాయి.

హిందూ ధర్మంలో దానాలకు చాలా ప్రాధాన్యం ఉంది. మనకు ఉన్నంతలో దానాలు చేయాలి. పాపాలు తొలగిపోయి, ఆత్మ సంతృప్తి, శుభం కలుగుతాయి. సంక్రాంతి రోజున దానాలు చేయాలని పండితులు చెబుతుంటారు. సంక్రాంతి రోజున ప్రత్యేకంగా కొన్ని దానాలు చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

బెల్లం, నల్ల నువ్వులు, నెయ్యి దానం చేయాలి
సంక్రాంతి రోజున దానాలు చేస్తే గ్రహ ప్రతికూల ప్రభావాలు పోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శనిదేవుని కృప పొందాలనుకునే దానాలు చేయాలి. బెల్లం, నల్ల నువ్వులను దానం చేస్తే సూర్యుడు, శనిదేవుని అనుగ్రహం దక్కుతుంది.

సూర్యునికి ప్రతీకగా భావించే బెల్లాన్ని దానం చేస్తే ఆరోగ్యంతో పాటు సుఖసంతోషాలు లభిస్తాయి. ఇక నల్ల నువ్వులను శనిదేవుడికి సంబంధించినవని పండితులు చెబుతారు. వీటిని దానం చేస్తే శని గ్రహ దోషాలు తగ్గుతాయి. దీంతో మీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోతాయి.

స్నానం చేశాక పూజ, తపస్సు చేసుకున్న తర్వాత నల్ల నువ్వులను దానం చేయాలి. అంతేకాదు. ఆలయాల్లోనూ నల్ల నువ్వులను సమర్పించుకోవచ్చు.

సంక్రాంతి రోజు పూజలు ముగిశాక నెయ్యిని దానం చేస్తే శుభకరం. నెయ్యి కలిపిన కిచిడీని లేదంటే మినపప్పుతో చేసిన కిచిడీని పేదలకు పంచిపెట్టాలి. దీంతో మీ జీవితం శాంతితో నిండుతుంది. అలాగే, పేదలకు నల్ల దుప్పట్లు దానం చేసినాశనిదేవుడి దయతో ఉద్యోగం, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. దానాలు చేసినవారిని అదృష్టం వరించే అవకాశాలు ఉంటాయి.

NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.