Kanuma Festival : కనుమ పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గోపూజ
కనుమ పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాని వారి దేవస్ధానంలో ఈరోజు గోపూజ నిర్వహించారు.

Durga Gudi Go Pooja
Kanuma Festival : కనుమ పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాని వారి దేవస్ధానంలో ఈరోజు గోపూజ నిర్వహించారు. వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీమతి.డి.భ్రమరాంబ శాస్త్రోక్తముగా గోపూజ నిర్వహించారు.
Also Read : TS Cabinet : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ? రేపు జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించనున్న సీఎం కేసీఆర్
ఇందులో భాగముగా గోమాతకు పసుపు, కుంకుమ, పూలు, వస్త్రములు సమర్పించి, ఆహారం ను అందజేసి పూజలు కార్యనిర్వహణాధికారి వారు నిర్వహించడం జరిగినది. గోపూజ అనంతరం కార్యనిర్వహణాధికారి గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి త్వరగా తొలిగిపోయి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ఆలయ వేదపండితులు శ్రీ ఆంజనేయ ఘనాపాటి గారు గో-మాత విశిష్టత ను, గోపూజ యొక్క వైశిష్ట్యమును తెలియజేశారు. అనంతరం ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆలయ వైదిక కమిటీ సభ్యులు గో -మాత వైశిష్ట్యం, గో-సేవ మరియు గో-పూజ ప్రాముఖ్యత ను తెలియజేశారు.