TS Cabinet : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ? రేపు జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ కేబినెట్‌ రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం  అవుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అనేక క

TS Cabinet : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ? రేపు జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించనున్న సీఎం కేసీఆర్

Ts Cm Kcr

Updated On : January 16, 2022 / 10:37 AM IST

TS Cabinet : తెలంగాణ కేబినెట్‌ రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం  అవుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ కేసుల కట్టడికి తీసుకోవాల్సిన  చర్యలపై కేబినెట్‌ చర్చించనుంది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకూ తెలంగాణలో స్కూళ్లు మూసి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.
Also Read : Sunday Lock Down : కరోనా కట్టడికి ప్రతి ఆదివారం లాక్ డౌన్ … ఎక్కడంటే…
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల పెంపు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ నిరోధానికి ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపైనా కేబినెట్ చర్చించనుంది.