Vijayawada : దుర్గమ్మకు బంగారు డైమండ్ హారం, భక్తులపై ప్రత్యేక ఆంక్షలు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు బంగారు డైమండ్ కంఠాభరణం కానుకగా సమర్పించారు.

Gold Necklace Gift : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు బంగారు డైమండ్ కంఠాభరణం కానుకగా సమర్పించారు. దీని విలువ రూ. 5 లక్షలు ఉంటుందని అంచనా. హైదరాబాద్ లో మహాలక్ష్మయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం ఇంద్రకీలాద్రికి వచ్చారు. అక్కడ ఆలయ ఈవో భ్రమరాంబ, ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గా ప్రసాద్ లను కలిసి డైమండ్ హారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా..దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అధికారులు, పాలక మండలి సభ్యురాలు శ్రీదేవి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను అందచేశారు.

Read More : Akhanda: దీపావళికే బాలయ్య ఆగమనం.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

మరోవైపు.. దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. కరోనా కారణంగా శరన్నవరాత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే దర్శనానికి వచ్చే భక్తులపై ప్రత్యేక ఆంక్షలు విధించనున్నారు. అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయడు తెలిపారు. రోజుకు పదివేల మంది భక్తులకు ఆన్‌లైన్ స్లాట్ ద్వారా మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తామన్నారు. నాలుగు వేల మందికి ఉచిత దర్శనం, మూడు వేల మందికి 300 రూపాయల టిక్కెట్ దర్శనం, మరో 3వేల మందికి 100 రూపాయల దర్శనం కేటాయించామని ఆయన తెలిపారు.

 

Read More : Bhabanipur Bypoll : తేలనున్న మమత భవితవ్యం, భవానీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

మూలా నక్షత్రం రోజున పది  వేల మంది భక్తులను పెంచే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు చైర్మన్‌.  తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. 11వ తేదీన రెండు అలంకారాల్లో దుర్గమ్మ  దర్శనమివ్వనున్నారు. ఉదయం అన్నపూర్ణాదేవి అలంకారంలో, మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 12  మూలానక్షత్రం రోజున దుర్గమ్మకు పట్టు వస్ర్తాలు సీఎం జగన్ సమర్పించనున్నారు. దసరా సమయంలో ఉదయం 3 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దుర్గమ్మ దర్శనం ఉంటుందన్నారు పైలా సోమి నాయుడు.

ట్రెండింగ్ వార్తలు