నేడే గురుపౌర్ణమి.. ఈరోజు ఇలా చేయండి.. లక్ష్మీదేవి ఆశీస్సులతోపాటు ఇంటికీ శ్రేయస్సు!

ఇవాళ గురు పౌర్ణమి. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగానూ పేర్కొంటారు. ఇదే రోజున వేదవ్యాస మహర్షి జన్మతిథి కావడంతో.. వేదాలు లోకానికి అందించిన వ్యాస భగవానుడిని ఈ వేడుకలో ప్రత్యేకంగా పూజిస్తారు.

నేడే గురుపౌర్ణమి.. ఈరోజు ఇలా చేయండి.. లక్ష్మీదేవి ఆశీస్సులతోపాటు ఇంటికీ శ్రేయస్సు!

Guru Pournami 2025

Updated On : July 10, 2025 / 7:59 AM IST

Guru Pournami 2025: ఇవాళ గురు పౌర్ణమి. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగానూ పేర్కొంటారు. ఇదే రోజున వేదవ్యాస మహర్షి జన్మతిథి కావడంతో.. వేదాలు లోకానికి అందించిన వ్యాస భగవానుడిని ఈ వేడుకలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో, దత్తాత్రేయ మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. క్షీరాభిషేకాలు చేశారు.

అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు గురువు. ప్రతిఒక్కరి జీవితంలో ఏదోఒక రీతిలో గురువు ఉంటారు. గురువు లేని జీవితం అసంపూర్ణం. ఎందుకంటే గురువు లేకుండా విజయం సరైన మార్గంలో లభించదు. సన్మార్గంలో నడిపించే గురువుని పూజించే రోజే ఆషాడ పూర్ణిమ. వ్యాస మహర్షి జన్మించిన ఈరోజు గురువుని పూజిస్తే జీవితంలో ఎప్పుడూ ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతారు.

గురుపౌర్ణమి సందర్భంగా పవిత్ర భగవద్గీతను ఇంటికి తీసుకెళ్లండి. మీతోనే ఉంచుకోండి. ఇది చదవడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తీరి మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం. ఈరోజు శ్రీయంత్రాన్ని మీతో ఇంటికి తీసుకెళ్లండి. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీ శ్రీయంత్రంలో నివసిస్తుందని, అందువల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుంటుందని నమ్ముతారు.
అదేవిధంగా గురుపౌర్ణమి రోజున మీ ఇంటికి లాఫింగ్ బుద్దుడి చిత్రాన్ని తీసుకెళ్లండి. లాఫింగ్ బుద్దుడు ఆనందం, శ్రేయస్సుకు ప్రతీక అని నమ్ముతారు. ఫలితంగా నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. గురుపౌర్ణమి సందర్భంగా ఇంట్లోకి కొత్త శంఖం తీసుకెళ్లండి. పూజ సమయంలో నీటితో నిండిన శంఖాన్ని సమర్పించడం పూజకు ప్రత్యేక ప్రాముఖ్యతను, ఆధ్యాత్మికతను జోడిస్తుంది.