హోలీ రోజున ఈ వస్తువులు దానం చేయకూడదు.. అవేమిటో తెలుసా?

హోలీ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం మానుకోవాలి. అవేమిటో ఇక్కడ చూద్దాం.

హోలీ రోజున ఈ వస్తువులు దానం చేయకూడదు.. అవేమిటో తెలుసా?

Holi Celebration

Holi 2024 : ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటాం. రంగులతో హోలీ ఆడుతూ చిన్నారులు, పెద్దలు సంతోషంగా గడుపుతారు. ఈ సంవత్సరం మార్చి 25న తెలుగు రాష్ట్రాల్లో రంగుల పండుగ హోలీని ఆడనున్నారు. అయితే, ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా హోలీ నాడు రాబోతుంది. హిందూ మతం ప్రకారం.. హోలీరోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం సందర్భంగా దానాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Also Read : Holi 2024: ఈ పూలు అందంగా కనిపించడమే కాదు.. రంగుల తయారీలోనూ..

హిందూ మతంలో ప్రతి సంవత్సరం హోలికా దహన్ ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది హోలికా మార్చి 24న అర్థరాత్రి వెలిగిస్తారు. మరుసటి రోజు హోలీని వైభంగా జరుపుకుంటారు. హోలీ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం మానుకోవాలి. అవేమిటో ఇక్కడ చూద్దాం.

 

  • వాస్తు ప్రకారం.. హోలీ రోజున వివాహిత స్త్రీలు బిందె, గాజులతో సహా 16 మేకప్ వస్తువులను దానం చేయకూడదు. ఒకవేళ ఇలాంటి వాటిని దానం చేస్తే అశుభ ఫలితాలు ఎదురవుతాయని నమ్మకం.
  • హోలికా దహనం రోజున డబ్బును దానం చేయొద్దు. ఇకవేళ డబ్బును దానం చేస్తే.. రాబోయేకాలంలో మన ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • హోలికా దహనం రోజున బట్టలు దానం చేయకూడదు. ఇలా చేస్తే.. ఇంట్లో దారిద్ర్యం వస్తుందని, మన జీవితంలో అశాంతి ఏర్పడుతుందని నమ్ముతారు.
  • నలుపు రంగు ప్రతికూలత మరియు అననుకూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అందు వల్ల హోలీ రోజున నల్ల మిరాయాలు, నల్ల బట్టలు, బూట్లు మొదలైన వాటిని దానం చేయడం మానుకోవాలి. అలా చేయడం వల్ల మన జీవితంలో సమస్యలు పెరుగుతాయి.
  • విరిగిన పోయిన, పాడైపోయిన వస్తువులను కూడా హోలీరోజున దానం చేయొద్దు. ఇలాంటి వాటిని దానం చేస్తే దేవతలకు కోపం తెప్పించినట్లవుతుంది.. పలితంగా మీ జీవితంలో అడ్డంకులు ఏర్పడవచ్చు.
  • ఇనుము, ఉక్కు వస్తువులను కూడా దానం చేయొద్దు. ఇలా చేస్తే ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.
  • హోలీ రోజున అరువు తెచ్చుకున్న వస్తువులు దానం చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అప్పుల భారం పెరుగుతుంది.
  • రంగుల పండుగలో పాలు, పెరుగు, పంచదార మొదలైన తెల్లటి వస్తువులను దానం చేయడం అశుభం. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలహీన పడుతుందని నమ్ముతారు.
  • హోలికా దహనం రోజున ఆవనూనె దానం చేయొద్దు. హోలీ రోజున ఇలా చేస్తే.. శనిదేవుడుని కోపానికి గురవుతారని నమ్ముతారు.
  •  హోలీ రోజున ఎవరికి బహుమతులు, గాజు వస్తువులను దానం చేయొద్దు. ఇలా చేయడం కారణంగా కుటుంబ సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.

Also Read : Holi 2024: ఈ పాటలు విననిదే హోలీ జరుపుకోం.. వింటే డ్యాన్స్ చేయకుండా ఉండలేం