Sravana Masam 2023 : కష్టాలు,కన్నీళ్లు గట్టెక్కించే ‘కన్నె తులసి నోము’గురించి తెలుసా..?
కన్నె తులసి నోము గురించి మీకు తెలుసా..? కష్టాలను కన్నీళ్ల నుంచి విముక్తి చేసే కన్నె తులసి నోము విశేషాలు.. ఎటువంటి సుఖ సంతోషాలు కలుగుతాయో తెలుసుకోండి..

Kanne Tulasi Nomu
Sravana Masam 2023..Kanne Tulasi Nomu : శ్రావణ మాసం అంటూ నోములు, వ్రతాల మాసం. మహిళలు ఏ నోము నోచుకున్నా..ఏ వ్రతం ఆచరించినా లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణమాసంలోనే నిర్వహించుకుంటారు. అటువంటి నోముల్లో ఓ నోము కష్టాలను, కన్నీళ్లను గట్టెక్కించే నోము ఒకటి ఉంది. ఇది వివాహం అయిన ముత్తైదువలు చేసుకునేది కాదు. వివాహం కాని కన్నెపిల్లలు నోచుకునే నోము. ఆ నోములోనే ఉంది కన్నె అనే మాట. అదే ‘కన్నె తులసి నోము’. కన్నె పిల్లలు జరుపుకునే ప్రధానమైన నోములలో ‘కన్నె తులసి నోము’ ఒకటి. ఈ నోము కష్టాలను, కన్నీళ్ల నుంచి గట్టెక్కిస్తుందని నమ్ముతారు. ఈ ‘కన్నె తులసి నోము’నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అంతేకాదు ఈ నోము నోచుకుంటే ఆరోగ్యాన్ని, ఆయుష్షుని కలిగిస్తుందనీ..వివాహం తరువాత సౌభాగ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
Srvaana Masam 2023 : శ్రావణమాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టతలు ..
ఈ నోము చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం..కన్నెపిల్లలు ప్రతీరోజు ఉదయాన్నే లేచి తన స్నానం చేసి ‘తులసి’ మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి. తులసి మాతకు మనస్ఫూర్తిగా భక్తిగా మూడు నమస్కారాలు చేసుకోవాలి. పూజల చేసిన అక్షింతలు తలపై వేసుకోవాలి. అలా సంవత్సరంపాటు ‘తులసి మొక్క’కు పూజ చేయాలి. తులసిని పూజించాక..26 జతల అరిసెలు చేయించి 13 జతల అరిసెలను తులసమ్మకు నైవేద్యంగా పెట్టాలి. నోము అంటే వాయనం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ కన్నె తులసి నోములో కూడా వాయనం ఇవ్వాల్సి ఉంటుంది. కన్నె తులసి నోము కాబట్టి కన్నెపిల్లకే వాయనం ఇవ్వాలి. అలా ఓ కన్నె పిల్లకు కొత్త బట్టలు పెట్టి..ఆమెకు 13 జతల అరిసెలను వాయనమివ్వాలి. నైవేద్యంగా పెట్టిన అరిసెలను తన ఈడు పిల్లలతో కలిసి తినాలి. తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి.
ఈ ‘కన్నె తులసి నోము’ వెనుక ఓ కథ ఉంది. ఓ కన్నెపిల్ల పడిన కష్టాలున్నాయి. సవితి తల్లి పెట్టిన కడగళ్లు ఉన్నాయి. ఈ నోము నోచుకున్నాక వచ్చిన ఆనందం ఉంది. పూర్వం ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయికి కన్నతల్లి చనిపోతుంది. తండ్రి మరో వివాహం చేసుకుంటాడు. ఆ సవతి తల్లి ఆమెను నానా కష్టాలు పెడుతుంది. సవతి తల్లి వలన తాను పడుతున్న కష్టాలను తండ్రితో చెప్పుకున్నా అతను రెండో భార్యకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. దీంతో సవతి తల్లి పెట్టే బాధల్ని భరించటం తప్పలేదు ఆమెకు.
Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?
కన్నతండ్రే తన బాధల్ని పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి అనుకున్న ఆమె అమ్మాయి రోజు తను పూజ చేసే ‘తులసి మొక్క’తో చెప్పుకునేది. అలా మనస్సులో కాస్త భారం తగ్గించుకునేది. అలా తనకు ఏ కష్టం వచ్చినా తులసిమొక్కతోనే చెప్పుకునేది. ఆఖరికి సవతి తల్లికి పుట్టిన మగబిడ్డను కూడా ఆమె సాకేది. అలా ఆ పిల్లాడికి అన్నీ చేసేది. ఓ రోజున సవతి తల్లి బయటకి వెళుతూ పిల్లవాడిని చూసుకోమంటూ చెప్పి ఆ అమ్మాయికి రెండు అరిసె ముక్కలిచ్చింది.
వాటిని ఆమె తులసి మొక్కకు నైవేద్యంగా పెట్టింది. నా బాధలు వినే తులసమ్మా నా నైవేద్యం స్వీకరించమ్మా అంటూ మనస్సులో అనుకుంది. దాంతో తులసి ప్రత్యక్షమై … క్రితం జన్మలో కన్నె తులసి నోము మధ్యలో ఆపేసావు అందుకే నీకు ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి..ఈ జన్మంలో అయినా కన్నె తులసి నోమును తీర్చుకోమని చెప్పింది. మీ అమ్మమ్మ గారింటికి వెళ్లి ఆ నోము నోచుకోమని పూజా విధానం అంతా చెప్పింది. అన్ని విన్న ఆ అమ్మాయి తులసమ్మ చెప్పినట్టుగానే అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఆ నోము నోచుకుంది. ఫలితంగా సవతి తల్లి మనసు మారింది. వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఇంటికొచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లింది. అప్పటినుంచి ఆమె కన్నబిడ్డలా చూసుకోవడం మొదలు పెట్టింది. అలా కన్నె తులసి నోము కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. సాధారణంగా ఇటువంటి నోము ఉందని చాలామందికి తెలియదు.
Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు