YV Subba Reddy(Photo : Google)
YV Subba Reddy : జూన్ 8న జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైష్ణోదేవి యాత్రకు వెళ్లే భక్తులు వెంకన్నను దర్శించుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. భక్తులు శ్రీవారి ఆశీస్సులు కూడా తీసుకోవచ్చన్నారు. జమ్మూలో మజీన్ గ్రామంలో టీటీడీ నూతనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించింది. ఆలయంలో జరుగుతున్న పనులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
దూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించగా, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామన్నారు.
Also Read..Medaram Jatara-2024: మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు
* జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ.
* జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ
* 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభం.
* శ్రీ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే జమ్మూ-కాట్రా మార్గంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయం.