Medaram Jatara-2024: మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు

Medaram Jatara-2024: సమ్మక్క సారలమ్మ జాతర తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు.

Medaram Jatara-2024: మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు

Medaram Jatara-2024

Medaram Jatara-2024: తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం జాతర-2024 (Medaram Jatara-2024) తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. 2024 ఫిబ్రవరిలో జరిగే మహజతర తేదీలను సమ్మక్క, సారలమ్మ (Sammakka, Sarakka Jatara) పూజారులు నేడు ప్రకటించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తామన్నారు. 21న (బుధవారం) కన్నేపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకొస్తామని చెప్పారు. అదే రోజు పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండయ్ నుంచి గోవిందరాజు సహ నాగులమ్మను మేడారం గద్దలపైకి పూజారులు తీసుకొస్తారు. 22న (గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరనుంది. 23న (శుక్రవారం) వనదేవతలు గద్దెలపై కొలువుతీరుతారు.

భక్తులు ఆరోజు మొక్కులు చెల్లించుకోవచ్చు. 24న (శనివారం) సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ వనప్రవేశం చేస్తారు. మేడారం జాతర భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఈ జాతర జరుగుతుంది. ప్రతి రెండేళ్లకు ఓ సారి ఈ జాతరను నిర్వహిస్తారు.

మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతర మొదలవుతుంది. 4 రోజుల పాటు జరుగుతుంది. జాతరకు ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు వస్తారు. ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా కొన్ని నెలల ముందు నుంచే అన్ని ఏర్పాటు చేసి, భక్తులను సౌకర్యాలు కల్పిస్తుంది. తెలంగాణ, ఏపీ నుంచే కాకుంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.

Waitress tip : టిప్ అందుకున్న వెంటనే జాబ్ పోగొట్టుకున్న వెయిట్రస్.. అదేంటీ…