Waitress tip : టిప్ అందుకున్న వెంటనే జాబ్ పోగొట్టుకున్న వెయిట్రస్.. అదేంటీ…

హోటల్‌కి వెళ్లినపుడు వెయిటర్‌కి టిప్ ఇవ్వడం సహజం. వారు మనకి అందించిన సర్వీస్‌కి వారిని ప్రోత్సహిస్తూ టిప్ ఇస్తాం. కానీ ఓ వెయిట్రస్ టిప్ తీసుకుందని రెస్టారెంట్ నిర్వాహకులు జాబ్ నుంచి తీసేసారు. అదేంటి? అంటారా.. చదవండి.

Waitress tip : టిప్ అందుకున్న వెంటనే జాబ్ పోగొట్టుకున్న వెయిట్రస్.. అదేంటీ…

Waitress tip

Waitress tip : ఓ వెయిట్రస్ కస్టమర్ నుంచి టిప్ తీసుకున్నందుకు రెస్టారెంట్ నిర్వాహకులు విధుల నుంచి తొలగించారు. అదేంటి? రెస్టారెంట్లలో ఇది కామనే కదా.. అనుకుంటున్నారు కదా.. టిప్ రూపంలో ఆమె అందుకున్న మొత్తం ఎంతో
తెలుసా? అక్షరాల 3.6 లక్షల రూపాయలు..

Viral Video: ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ ప్రారంభించిన ఆవు

రెస్టారెంట్లలో వెయిటర్ లేదా వెయిట్రస్ చేసే సర్వీస్‌కి టిప్ ఇస్తుంటాము. ఇలా చేయడం కేవలం ప్రోత్సహించడానికి మాత్రమే. అయితే ఒక వెయిట్రస్ కస్టమర్ నుండి టిప్ స్వీకరించగానే ఉద్యోగం కోల్పోయింది. ర్యాన్ బ్రాండ్ట్ అనే మహిళ 40 కంటే ఎక్కువమంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లతో ఉన్న టేబుల్స్‌పై ఫుడ్ సర్వీస్ అందించింది. అందుకు గాను వారిలో ఒకరు ఆమెకు భారీ మొత్తంలో టిప్ అందించారు. అంత పెద్ద మొత్తాన్ని అందుకున్న ఆమె ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. అంతలోనే ఆమె ఊహించని ట్విస్ట్ ఎదుర్కుంది.

 

రెస్టారెంట్ నిర్వాహకులు వెంటనే ఆమెను విధుల్లోంచి తొలగించారు. ఇంతకీ ఆమె అందుకున్న మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాల 4,400 డాలర్లు. అంటే రూ.3.6 లక్షల రూపాయలు.  నిజానికి తాను పొందిన టిప్‌లో 20 శాతం మాత్రమే ర్యాన్ తీసుకోవాలని అనుకుందట. మిగిలిన భాగాన్ని తన షిఫ్ట్ మేనేజర్‌కి ఇవ్వాలని అనుకుందట. ఈలోపే రెస్టారెంట్ యజమాని ర్యాన్‌ని జాబ్ నుంచి పీకేసారు.

celebrity restaurant : 5 స్టార్ హోటల్‌‌లో ఫుడ్ క్రిటిక్‌లా నటించాడు.. రెస్టారెంట్ వాళ్లిచ్చిన ట్రీట్మెంట్‌కి షాకయ్యాడు

పాపం తమ టిప్ వల్ల ర్యాన్ జాబ్ పోగొట్టుకుందని తెలిసి టిప్ ఇచ్చినవారిలో ఒకరైన వైజ్ చాలా బాధపడి ర్యాన్‌కి ఏదైనా సాయం చేయాలని అనుకున్నారట. వెంటనే ఆమె కోసం GoFundMe పేజీని ప్రారంభించారు. అలా కొద్దిరోజుల్లోనే 8,700 డాలర్లు సేకరించారట. ఆ మొత్తాన్ని ర్యాన్‌‌కి ఇచ్చారట. తమ వల్ల జాబ్ పోగోట్టుకున్న ర్యాన్‌కి ఇలా వారు సాయం చేయడం నిజంగా గ్రేట్.