Mahashivratri..Rudraksha : పరమశివుడి ప్రత్యక్ష రూపాలు రుద్రాక్షలు..ఏ రుద్రాక్ష ఏ దేవతాస్వరూపమో తెలుసా?

రుద్రాక్ష.  రుద్ర+అక్ష = రుద్రాక్ష పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల నుండి అంటే కన్నుల నుంచి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచాయని అవి వృక్షాలుగా మారాయని అంటారు. ఆ వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. అంత పవిత్రమైన రుద్రాక్షల్లో ఏఏ దేవతల స్వరూపాలుంటాయంటే..

Mahashivratri..Rudraksha : పరమశివుడి ప్రత్యక్ష రూపాలు రుద్రాక్షలు..ఏ రుద్రాక్ష ఏ దేవతాస్వరూపమో తెలుసా?

Rudrakshas are special..Rudrakshas are forms of Gods

Updated On : February 17, 2023 / 5:07 PM IST

Mahashivratri :  రుద్రాక్ష.  రుద్ర+అక్ష = రుద్రాక్ష పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల నుండి అంటే కన్నుల నుంచి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచాయని అవి వృక్షాలుగా మారాయని అంటారు. ఆ వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. వీటిలో ఏకముఖి రుద్రాక్ష అత్యంత పవిత్రమైనది అంటారు. ఏకముఖి రుద్రాక్షను పరమశివ స్వరూపముగా భావిస్తారు. సూర్యుని స్వరూపంగా కూడా పూజిస్తారు.

ఏక ముఖి రుద్రాక్ష వలన సూర్యగ్రహ ప్రాప్తి లభిస్తుందంటారు. ఇలా పలు ముఖాల రుద్రాక్షలు ఉంటాయి. ఏకముఖి రుద్రాక్ష నుంచి దశముఖి రుద్రాక్షలు ఉంటాయి. ఇంకా చాలా ముఖాలతో రుద్రాక్షలు ఉంటాయి. ఇలా ఏఏ రుద్రాక్షల్లో ఏఏ దేవాతా స్వరూపాలు ఉంటాయో తెలుసుకుందాం..

ఏకముఖి రుద్రాక్ష – శివస్వరూపం
ద్విముఖి – అర్థనారీశ్వరరూపం
త్రిముఖి – అగ్ని స్వరూపం

చతుర్ముఖి – బ్రహ్మస్వరూపం, సరస్వతికి ప్రీతికరం
పంచముఖి- కాలాగ్ని స్వరూపం
షణ్ముఖి- కార్తికేయ రూపం (సుబ్రమణ్య)

సప్తముఖి- మన్మథుని రూపం
అష్టముఖి- రుద్రభైవర రూపం
నవముఖి- ధర్మదేవతా స్వరూపం

దశముఖి- విష్ణు స్వరూపం
ఏకాదశముఖి- రుద్రాంశ స్వరూపం
ద్వాదశముఖి- ద్వాదశాదిత్య రూపం

 

Mahashivratri 2023 : శివుడికి ఇష్టమైన ద్రవ్యాలు.. ఐశ్వర్యపాప్తి కలిగించే అభిషేకాలివే..