Tirumala On Line Senior Citizens Piligrims Quota
Tirumala : కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జులై 23వ తేదీన ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో దర్శనానికి అనుమతిస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులను కోరింది.
Also Read : Madhya Pradesh : స్కూటర్ సరిగ్గా నడపమన్నందుకు డిప్యూటీ కలెక్టర్ పై దాడి చేసిన దంపతులు