Tirumala : శ్రీవారికి వైభవంగా జరిగిన పుష్ప పల్లకీ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం జరిగిన సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.

Pushpa Pallaki Seva
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం జరిగిన సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.
వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగాలను సూచిస్తూ శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుని ప్రతిమలను పల్లకీపై కొలువుదీర్చారు.
5 రకాల సంప్రదాయ పుష్పాలు, 5 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు. ఈరోడ్ కు చెందిన దాత సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు.