Jharkhand Mahadev Temple : అటువంటి దుస్తులతో వస్తే ఆలయంలోకి అనుమతిలేదు : మహాదేవ్ ఆలయంలో డ్రెస్ ‌కోడ్

రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో కొలువైన ఝార్ఖండ్ మహాదేవ్ ఆలయ నిర్వాహకులు భక్తులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు.

Jharkhand Mahadev Temple : అటువంటి దుస్తులతో వస్తే ఆలయంలోకి అనుమతిలేదు : మహాదేవ్ ఆలయంలో డ్రెస్ ‌కోడ్

Jharkhand Mahadev Temple dress code

Updated On : July 8, 2023 / 1:03 PM IST

Jharkhand Mahadev Temple dress code : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో కొలువైన ఝార్ఖండ్ మహాదేవ్ ఆలయ నిర్వాహకులు భక్తులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. శివయ్య కొలువైన ఈ దేవాలయంలోకి ఫార్ట్ లు, మినీ స్కర్టులు, ఫ్రాకులు, రిఫ్డ్ జీన్స్, నైట్ సూటులు ధరించి రావద్దని కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. దీనికి సంబంధించి ఆలయం వెలుపల బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లలో సంప్రదాయ దుస్తులు ధరించాలని..ఏమేమి దస్తులు ధరించిరాకూడదో పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినవారికి మాత్రమే ఆలయం ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. అలాకాకుండా పొట్టి బట్టలు..నిషేధించిన దుస్తులు ధరించి వచ్చినవారిని ఆలయం లోపలికి అనుమతి ఉండదని సూచించారు.

అలాగే జీన్స్ ప్యాంటులను కూడా నిషేధించారు.చిరిగిన జీన్స్‌, స్కర్ట్స్ ధరించి భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అందువల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి వచ్చే స్త్రీ పురుషుల వస్త్ర ధారణ హుందాగా ఉండాలని..ఏవి పడితే ఆ దస్తులు ధరించి రాకూడదని ఆలయ ప్రధాన అధ్యక్షుడు జయప్రకాశ్ సోమాని తెలిపారు. పలు రకాల దుస్తులు ధరించి రావటం భారత సంప్రదయానికి విరుద్ధమని..అందుకే ఇటువంటి నిబంధన ప్రవేశ పెట్టామని తెలిపారు.

ఒక వేళ ఎవరైనా నిషేధించిన దుస్తులు ధరించి వస్తే వారిని ఆలయం లోపలికి అనుమతి ఉండదని వారు దేవాలయం బయటనుంచే నమస్కరించుకుని వెళ్లిపోవాల్సి ఉంటుందని తెలిపారు. ఒక వేళ తెలియక నిషేధిత దుస్తులు ధరించి వచ్చినవారికి చీరలు, ధోవతులు వంటి భారతీయ సంప్రదాయ దుస్తులు మార్చుకునే రూములను ఏర్పాటు చేశామని తెలిపారు.