Ram Mandir Rangotsav : రామమందిరంలో రంగోత్సవం.. అయోధ్యలో భక్తుల హోలీ వేడుకలు

Rangotsav At Ram Mandir : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సోమవారం హోలీ సందర్భంగా శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు.

Rangotsav At Ram Mandir : ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన అయోధ్యలో హోలీ సందడి కనిపిస్తోంది. రామమందిరంలో మొదటిసారిగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హోలీ వేడుకల సందర్భంగా శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. రామ్‌లల్లా దర్శనం కోసం భక్తులంతా పెద్ద ఎత్తున రామాలయానికి చేరుకున్నారు. శ్రీరామ జన్మభూమి మందిర్‌లో రంగోత్సవం వేడుకలను జరుపుకున్నారు.

Read Also : Bengaluru Water Shortage : బెంగళూరులో నీటి సంక్షోభం.. నీళ్లను వృథా చేసిన 22 కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా!

దీనికి సంబంధించి ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం సోమవారం (X)లో పోస్ట్ చేసింది. అయితే, రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత హనుమాన్‌గర్హి ఆలయంలోని స్వామివారికి రంగులు వేయడం ద్వారా రంగుల పండుగ, ‘రంగోత్సవ్’ మొదటి ‘రంగభరి ఏకాదశి’ నాడు ప్రారంభమైంది. సోమవారం (మార్చి 25) హోలీ సందర్భంగా మొదటి హోలీ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు :
బాలరాముడుని పూలతో అందంగా అలంకరించారు. రాముడి నుదిటిపై గులాల్ రంగును పూశారు. అంతేకాదు.. గులాబీ రంగుల వస్త్రాలతో రామ్‌లల్లా అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాడు. హోలీ పండుగను పురస్కరించుకుని ఆలయ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రామ్‌లల్లా దర్శనం కోసం భక్తులు రామాలయానికి తరలివచ్చారు.

రామమందిరంలో భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ రంగులు అద్ది హోలీ వేడుకల్లో మునిగిపోయారు. దేశంలో అందరూ చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ హోలీ. మార్చి 25న ఈ పండుగకు ముందు హోలికా దహన్ అని పిలిచే భోగి మంటలను వేసే ఆచారం ఉంది. హోలికా అనే రాక్షసుడిని దహనం చేస్తారు. చెడుపై మంచి విజయం సాధించినట్టుగా చెబుతారు. ఈ ఆనందోత్సాహాల మధ్య, సాంప్రదాయ స్వీట్లు పంచుకుంటారు.

Read Also : హోలీ రోజున ఈ వస్తువులు దానం చేయకూడదు.. అవేమిటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు