Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీవ్రతం రోజు కలశం ఎలా తయారు చేసుకోవాలి?
వరలక్ష్మీ వ్రతం నాడు కలశకు పూజలు చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు కలశం ఎలా తయారు చేసుకోవాలి? అందుకోసం ఏమీమి కావాలి.

Varalakshmi Vratham 2023
Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీ వ్రతం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. పూజ ప్రారంభించడానికి ముందు కలశం సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల కలశాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ శాస్త్ర ప్రకారం పూజ చేసుకునేవారు అసలు కలశం ఎలా తయారు చేసుకోవాలి? అందులో ఏం వేయాలి? చాలామందిలో దీనిపై అనుమానాలు ఉంటాయి. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 25 శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో కలశం ఎలా తయారు చేసుకోవాలో వివరాలు మీకోసం.
వరలక్ష్మీ వ్రతం రోజు వేకువ ఝామునే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు కలశాన్ని తయారు చేసుకోవాలి.
కలశం తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు
ఇత్తడి లేదా రాగి లేదా వెండి చెంబు, కొబ్బరి కాయ
మూడు లవంగాలు, మూడు యాలకులు, వక్క
రాగి లేదా ఇత్తడి నాణాలు (5 రూపాయల కాయిన్స్ తీసుకోవచ్చు)
ఒక పళ్లెం, కాసిని బియ్యం
తులసి దళాలు, ఎర్రని పుష్పం ఏదైనా, పచ్చ కర్పూరం
మామిడాకులు లేదా తమలపాకులు (తమలపాకులు 3 లేదా 5)
అక్షతలు, కలశానికి కట్టడానికి పసుపుకొమ్ము, రవిక
పసుపు, కుంకుమ, గంధం
Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీ రూపు కొనుక్కోవాలని రూల్ ఉందా?
పళ్లెంలో బియ్యం వేసి దానిపై చెంబును పెట్టాలి. చెంబులో పరిశుభ్రమైన నీరు పోయాలి. ఆ నీటిలో పుష్ఫం, అక్షతలు, పసుపు, కుంకుమ, తులసిదళాలు, వక్క వేయాలి. పచ్చ కర్పూరం నలిపి వేయాలి. రాగి లేదా ఇత్తడి నాణాలను కూడా అందులో వేయాలి. కలశంపై మావిడాకులు లేదా తమలపాకులు పెట్టాలి. కొబ్బరికాయకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి చెంబుపై నిలబెట్టాలి. పూవులతో అలంకరణ చేసుకోవాలి. రవికను పెట్టుకునే వారు కొబ్బరికాయపై రవికను అలంకరించాలి. కలశానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పసుపు కొమ్ము కడుతూ శ్రీసూక్తం, లేదా లక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది. కలశంపై కొందరు వరలక్ష్మీదేవి వెండి ముఖాన్ని అమర్చి అలంకరణ చేస్తారు. కలశానికి రెండువైపులా దీపాలు పెట్టి పూజ ప్రారంభించాలి
శుక్రవారం నాడు కలశాన్ని తీయకూడదు కాబట్టి శనివారం కలశాన్ని తీసివేస్తారు. కలశంపై పెట్టిన కొబ్బరికాయను ప్రసాదంగా తింటారు. కలశంలోని నీటిని పచ్చని చెట్టులో పోస్తారు.