Sravana Masam : శ్రీశైలంలో శ్రావణమాస పౌర్ణమి పూజలు

శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు.

Sravana Masam : శ్రీశైలంలో శ్రావణమాస పౌర్ణమి పూజలు

Srisailam Temple

Updated On : August 22, 2021 / 6:22 AM IST

Srisailam : శ్రావణమాసం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమం…ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగాయి. ఉభయ దేవాలయాల్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, అభిషేకాలు నిర్వహించారు.

Read More : Naked : దారుణం.. వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగింపు

అనంతరం దేవతామూర్తులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అదే రోజు సాయంత్రం పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి లక్ష కుంకుమార్చన, ఊయల సేవలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు అర్చక వేదపండితులు షోడశోపచార క్రతువులు జరిపి లలితా సహస్త్రనామ పఠనంతో కుంకుమార్చన నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన…పూజావిధిలో భక్తులు పరోక్ష సేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించారు ఆలయ అధికారులు.

Read More : Kalyan Singh : మాజీ సీఎం కన్నుమూత

దీంతో వివిధ ప్రాంతాల నుంచి ఈ సేవలో పలువురు పాల్గొన్నారు. అంతేగాకుండా..దేశ విదేశాల్లో ఉన్న వారు పౌర్ణమి ప్రదోషకాల పూజల్లో పాల్గొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ఆలయ నిర్వాహకులు, అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రత్యేక పూజల సందర్భంగా ఆలయాన్ని అందంగా పూలతో ముస్తాబు చేశారు.