Kapileswara Swamy : కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే

ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించడం జరుగుతుందని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది. 

Kapileswara Swamy : కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే

Kalpeshwaram

Updated On : January 30, 2022 / 7:37 PM IST

Sri Kapileswara Swamy Brahmotsavam  : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఏ రోజు ఏ వాహన సేవలు నిర్వహించనున్నారో టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.

Read More : Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్!

22-02-2022 (ఉదయం) ధ్వజారోహణం (మీన‌లగ్నం) (సాయంత్రం) హంస వాహనం
23-02-2022 (ఉదయం) సూర్యప్రభ వాహనం. (సాయంత్రం) చంద్రప్రభ వాహనం
24-02-2022 (ఉదయం) భూత వాహనం. (సాయంత్రం) సింహ వాహనం
25-02-2022 (ఉదయం) మకర వాహనం (సాయంత్రం)  శేష వాహనం
26-02-2022 (ఉదయం) తిరుచ్చి ఉత్సవం. (సాయంత్రం) అధికారనంది వాహనం
27-02-2022 (ఉదయం) వ్యాఘ్ర వాహనం. (సాయంత్రం) గజ వాహనం
28-02-2022  (ఉదయం) కల్పవృక్ష వాహనం. (సాయంత్రం) అశ్వవాహనం
01-03-2022 (ఉదయం) రథోత్సవం(భోగితేరు). (సాయంత్రం) నందివాహనం
02-03-2022 (ఉదయం) పురుషా మృగవాహనం. (సాయంత్రం) కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
03-03-2022 (ఉదయం) శ్రీ నటరాజ స్వామి వారి రావణాసుర వాహనం. సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. (సాయంత్రం) ధ్వజావరోహణం.

Read More : Budget 2022: కేంద్ర బడ్జెట్‌తో బ్యాంకుల బాదుడు షురూ

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించడం జరుగుతుందని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది. శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందని తెలిపారు. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు.