Srivari Brahmotsavam : ఢిల్లీలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Srivari Brahmotsavam: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వాహనసేవలు నిర్వహిస్తారు. మే 13న పుష్పయాగంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Srivari Brahmotsavam : ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ గోల్ మార్కెట్ వద్ద ఉన్న టీటీడీ ఆలయంలో వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు. మే 13 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి కల్యాణోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు వారు, ఉత్తరాది వాసులు పాల్గొన్నారు. కోవిడ్ నియమావళి పాటిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసింది.

Also Read..Medaram Jatara-2024: మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వాహనసేవలు నిర్వహిస్తారు. ఈరోజు రాత్రి గ‌రుడ వాహ‌నంపై శ్రీవారు ఊరేగనున్నారు. మే 13న పుష్పయాగంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఏపీ భవన్, తమిళనాడు, కర్ణాటక భవన్ లో బ్రహ్మోత్సవాల గురించి తెలిపేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీటీడీ బోర్డు, ఎల్ఏసీ సభ్యుల నిధులతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు