Statue of Equality : సమతామూర్తి.. ప్రధాన కార్యక్రమాల వివరాలు

ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...

Samata

Sri Chinna Jeeyar Swamy : సహస్ర కాంతుల దీపం భగవద్రామానుజులు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు. ఈ భువిపై ఆ పావనమూర్తి అవతరించి వెయ్యేళ్లు. అందుకే..ఆ సమతామూర్తికి కృతజ్ఞతగా.. ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకూ సహస్రాబ్ది మహోత్సవాలను శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో వైభవంగా నిర్వహించేందుకు తలపెట్టారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి! అంతేకాదు..వారి సత్య సంకల్పం సిద్ధించి.. దివ్య సాకేతంలో 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం రూపుదిద్దుకుంది. ఫిబ్రవరి 5న భగవద్రామానుజుల మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ప్రధాని నరేంద్రమోదీ.

Read More : Eat Almonds : బాదం తింటూ చెడు కొవ్వులు కరిగించండి..

ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేస్తారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవునెయ్యితోబాటు ఇతర హోమ ద్రవ్యాలు వినియోగిస్తారు. సమతాస్ఫూర్తిని చాటుతూ నిర్వహించనున్న రామనుజ సహస్రాబ్ది సంరంభం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక.. వేడుకల ముగింపు రోజైన ఫిబ్రవరి 14న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

Read More : Coal Mine : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. అక్రమ గనిలో ఐదుగురు మృతి..!

ఫిబ్రవరి 3: అగ్ని ప్రతిష్ఠ, అష్టాక్షరి జపం
ఫిబ్రవరి 5 (వసంత పంచమి) : సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి రాక
ఫిబ్రవరి 8 (రథసప్తమి): ఆదిత్యహృదయం పారాయణం

Read More : Pesara Flour : ముఖంపై జిడ్డు, మృతకణాలు తొలగిపోవాలంటే పెసర పిండితో

ఫిబ్రవరి 11: సామూహిక ఉపనయనం
ఫిబ్రవరి 12 (భీష్మ ఏకాదశి): విష్ణు సహస్రనామ పారాయణం
ఫిబ్రవరి 13: రామానుజాచార్య బంగారుమూర్తి విగ్రహం ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రాక
ఫిబ్రవరి 14: మహాపూర్ణాహుతి