TTD e-Auction : ఈ నెల 24న తిరుమలలో వాచీలు, మొబైల్ ఫోన్ కానుకలపై టీటీడీ ఈ-వేలం..

TTD e-Auction : భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకుల్లో మొబైల్ ఫోన్లు, వాచీలను రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయ‌నున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

TTD e-Auction : ఈ నెల 24న తిరుమలలో వాచీలు, మొబైల్ ఫోన్ కానుకలపై టీటీడీ ఈ-వేలం..

TTD e Auction of Watches and Smart Phones ( Image Source : Google )

Updated On : June 21, 2024 / 9:47 PM IST

TTD e-Auction : తిరుమలలో భక్తులు సమర్పించిన కానుకలను టీటీడీ దేవస్థానం ఈ నెల 24న ఈ-వేలం వేయనుంది. ప్రధానంగా శ్రీవారి ఆలయ హిండీతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకుల్లో మొబైల్ ఫోన్లు, వాచీలను రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయ‌నున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గాడ్జెట్ కానుకలలో క్యాషియో, టైటాన్‌, ఆల్విన్‌, టైమెక్స్‌, సొనాటా, ఫాస్ట్‌ట్రాక్, టైమ్‌వెల్‌ ఇతర కంపెనీల వాచ్‌లు కూడా ఉన్నాయి.

అంతేకాదు.. నోకియా, వివో, శాంసంగ్, కార్బన్, ఒప్పో, మోటోరోలా మొబైల్ తయారీ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. వీటిలో కొత్త వాచ్, ఫోన్లతో పాటు సెకండ్ హ్యాడ్ గాడ్జెట్లు, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు, స్మార్ట్‌ఫోన్లు 24 లాట్లు ఈ-వేలంలో ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ-వేలానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు టీటీడీ మార్కెటింగ్‌ ఆఫీసు 0877-2264429 నంబ‌రు ద్వారా సంప్రదించవచ్చు.

ఆఫీసు వేళల్లో టీటీడీ వెబ్‌సైట్‌ (www.tirumala.org) లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ (www.konugolu.ap.gov.in)ను సంప్రదించాలని అధికారులు కోరారు. అలాగే, దయచేసి (http:// t.tptblj.in/g ) వెబ్‌సైట్ సందర్శించండి. తిరుమలలో దర్శనం, వసతికి బుకింగ్ కోసం అధికారిక టీటీడీ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Read Also : రాముడా? నారాయణుడా? రాములోరి క్షేత్రం భద్రాచలంలో ఎడతెగని వివాదం.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ