మేళ్ల‌చెరువులో ఘనంగా వేంక‌టేశ్వ‌ర స్వామి ఉత్సవాలు

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 26 వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

మేళ్ల‌చెరువులో ఘనంగా వేంక‌టేశ్వ‌ర స్వామి ఉత్సవాలు

Venkateswara Swamy Brahmotsavalu Started from Today

Venkateswara Swamy Brahmotsavalu : సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్ పరిశ్రమలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 26 వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజులు పాటు శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళ శాసనములతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

ఈ ఉత్సవాలు భాగంగా తొలి రోజు నవకలశ స్నపనము, అంకురారోపణము, ద్వజాధివాసము వేదపండితులు నిర్వహించారు. మైహోమ్ గ్రూపు ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు, జీఎం రామ్ మోహన్‌రావు దంపతులు, యూనిట్ శ్రీనివాస్‌రావు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

శనివారం తిరుప్పావై సేవా కాలము, తిరువేదు ఉత్సవం, ధ్వజారోహణము, బేరి పూజ, దేవత ఆహ్వానము నిర్వహించనున్నారు ఆదివారం లక్ష కుంకుమార్చన, ఎదురుకోలు నిర్వహించనుండగా సోమవారం స్వామి అమ్మవారుల తిరు కళ్యాణ మహోత్సవం జరుగనుంది.

ఇక, మంగళవారం తిరు వీధి ఉత్సవం, ప్రణయ కలహోత్సవం, అశ్వవాహుల సేవ, దీపోత్సవం నిర్వహించనున్నారు. బుధవారం రథోత్సవం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, తీర్థ ప్రసాద గోష్టి, గురువారం అష్టోత్తర శతకలసాభిషేకం, రుత్విక్ సన్మానం నిర్వహించనున్నారు.

Read Also : జూన్ నెలలో తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌