Andal Tiruppavai : ధనుర్మాసం…నేటి నుంచి ప్రారంభం

ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు....

Dhanurmasam

Dhanurmasam 2021 : ధనుర్మాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 2021, డిసెంబర్ 16వ తేదీ గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల రోజులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. ఈనెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనదని అంటుంటారు.

Read More : Madhya Pradesh : వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలి..లేకపోతే..ఉరి తీస్తా

ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి ప్రసాదాన్ని భక్తులకు అందచేస్తారు. పిల్లలకు ఇచ్చేది బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.

Read More : Prakasam : ఏపీలో మరో బస్సు ప్రమాదం…

తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలని, తర్వాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలని పండితులు చెబుతుంటారు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారని, ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతమని అంటుంటారు. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.