China F1 Grand Prix: కొవిడ్ కొట్టిన దెబ్బ.. వరుసగా నాలుగోసారి రద్దైన ఫార్మూలా-1 గ్రాండ్ ప్రిక్స్
ఇప్పటికే విడుదల చేసిన ఫార్ములా-1, 2023 క్యాలెండర్‌లోని స్లాట్‌ను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అనంతరం నిర్వహించాల్సిన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. చైనాలో ఫార్ములా-1 గ్రాండ్ రేసు 2019లో షాంఘైలో జరిగింది. ఆ ఏడాదిలో కొవిడ్ రావడంతో 2020 నుంచి వరుసగా రద్దు అవుతూ వస్తోంది.

2023 China F1 Grand Prix Cancelled For 4th Consecutive Year Due To Covid
China F1 Grand Prix: కోవిడ్-19 మహమ్మారి కారణంగా చైనాలో నిర్వహించాల్సిన ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్ వరుసగా నాలుగో ఏడాది రద్దైంది. కొవిడ్ ఆంక్షల కారణంగా ఈ యేడాది కూడా ఎఫ్-1 గ్రాండ్ నిర్వహించడం లేదని శుక్రవారం చైనీస్ ఫార్ములా వన్ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. “కొవిడ్-19 పరిస్థితి వల్ల కొనసాగుతున్న ఇబ్బందుల కారణంగా 2023 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ జరగడం లేదు. ప్రమోటర్, సంబంధిత అధికారులతో సంభాషణను అనుసరించి ఫార్ములా-1 తదుపరి నిర్వహణ ఎప్పుడనేది నిర్ణయిస్తారు” అని సదరు వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.
Pet Dog Birthday Party : పెంపుడు కుక్క బర్త్‌డే..రూ .4500 డ్రెస్ .. బంగారు గొలుసులు బహుమతి
ఇప్పటికే విడుదల చేసిన ఫార్ములా-1, 2023 క్యాలెండర్‌లోని స్లాట్‌ను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అనంతరం నిర్వహించాల్సిన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. చైనాలో ఫార్ములా-1 గ్రాండ్ రేసు 2019లో షాంఘైలో జరిగింది. ఆ ఏడాదిలో కొవిడ్ రావడంతో 2020 నుంచి వరుసగా రద్దు అవుతూ వస్తోంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో నిర్వహించాల్సిన రేసుకు కూడా కొవిడ్ అడ్డు పడింది. నిజానికి చైనాలో లాక్‌డౌన్ ఆంక్షలపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో దేశ పాలనా యంత్రాంగం దిగి వచ్చి అనేక ఆంక్షలను సడలించారు. ఈ నేపథ్యంలో ఎఫ్-1 రేసుపై రద్దు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.