West Indies vs India: వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు ఎవరో తెలుసా?
జులై 12 నుంచి వెస్టిండీస్ - భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

Team india
West Indies vs India: భారత్‌లో నవంబరు-డిసెంబరులో ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 (ICC World Cup 2023) జరగనుంది. అంతకంటే ముందు భారత్ పలు టోర్నీల్లో పాల్గొంటుంది. జులై 12 నుంచి వెస్టిండీస్ – భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అనంతరం మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు ఎవరో చూద్దాం.
* వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కపిల్ దేవ్‌పై ఉంది. వెస్టిండీస్‌తో మొత్తం 25 టెస్టు మ్యాచులు ఆడిన కపిల్ దేవ్ 24.89 యావరేజ్‌తో 89 వికెట్లు పడగొట్టారు. బెస్ట్ బౌలింగ్ 9/83 (83 పరుగులు ఇచ్చి తొమ్మిది వికెట్లు).
* వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ అనిల్ కుంబ్లే. మొత్తం 17 మ్యాచుల్లో 29.78 యావరేజ్‌తో కుంబ్లే 74 వికెట్లు తీశారు. బెస్ట్ బౌలింగ్ 6/78.
* టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ బౌలర్ శ్రీనివాస్ వెంకట్రాఘవన్ వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కొనసాగుతున్నారు. 23 మ్యాచుల్లో 39.47 యావరేజ్‌తో 68 వికెట్లు తీశారు. బెస్ట్ బౌలింగ్ 5/95.
* వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. 15 మ్యాచుల్లో 33.52 యావరేజ్‌తో ఆయన 65 వికెట్లు తీశారు. బెస్ట్ బౌలింగ్ 7/157.
* టీమిండియా మాజీ బౌలర్ బిషన్ సింగ్ బేదీ.. వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అయిదవ బౌలర్. వెస్టిండీస్‌పై 18 టెస్టులు ఆడి 34.88 యావరేజ్ తో 62 వికెట్లు తీశారు. బెస్ట్ బౌలింగ్ 5/82.