IND vs ENG 5th t20 : అభిషేక్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీ.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో భార‌త ప్లేయ‌ర్‌గా ..

టీ20ల్లో రెండో వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాడిగా అభిషేక్ శ‌ర్మ రికార్డుల‌కు ఎక్కాడు.

IND vs ENG 5th t20 : అభిషేక్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీ.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో భార‌త ప్లేయ‌ర్‌గా ..

ABHISHEK SHARMA

Updated On : February 2, 2025 / 9:21 PM IST

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20ల్లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన రెండో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స‌ర్ల సాయంతో అభిషేక్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో అత‌డికి ఇది రెండో సెంచ‌రీ కావ‌డం గ‌మనార్హం. ఈ క్ర‌మంలో అత‌డు సంజూ శాంస‌న్ రికార్డును బ్రేక్ చేశాడు. 2024లో శాంస‌న్ 40 బంతుల్లో బంగ్లాదేశ్ పై సెంచ‌రీ చేశాడు. కాగా.. 2017లో శ్రీలంక పై 35 బంతుల్లో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేసి ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో అత్యంత వేగంగా సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

రోహిత్ శ‌ర్మ  – శ్రీలంక పై 35 బంతుల్లో (2017)
అబిషేక్ శ‌ర్మ  – ఇంగ్లాండ్ పై 37 బంతుల్లో (2025)
సంజూ శాంస‌న్  – బంగ్లాదేశ్ పై 40 బంతుల్లో (2024)

IND vs ENG : ఓరి నాయ‌నో ఇదేం ట్విస్ట్.. అర్ష్‌దీప్ సింగ్‌కు నో ప్లేస్‌.. ఆ రికార్డు కోసం ఈ పేస‌ర్‌ ఇంకెన్నాళ్లు ఆగాలో తెలుసా?

ఇక ఓవ‌రాల్‌గా తీసుకుంటే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంత‌మైన సెంచ‌రీ చేసిన మూడో ఆట‌గాడిగా అభిషేక్ రికార్డుకు ఎక్కాడు. ఈ జాబితాలో డేవిడ్ మిల్ల‌ర్‌, రోహిత్ శ‌ర్మ లు సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్నారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు..

డేవిడ్ మిల్ల‌ర్ (ద‌క్షిణాఫ్రికా) – బంగ్లాదేశ్ పై 35 బంతుల్లో (2017)
రోహిత్ శ‌ర్మ (భార‌త్) – శ్రీలంక పై 35 బంతుల్లో (2017)
అబిషేక్ శ‌ర్మ (భార‌త్‌) – ఇంగ్లాండ్ పై 37 బంతుల్లో (2025)
జాన్సన్ చార్లెస్ (వెస్టీండీస్‌) – ద‌క్షిణాఫికా పై 39 బంతుల్లో (2023)
సంజూ శాంస‌న్ (భార‌త్‌) – బంగ్లాదేశ్ పై 40 బంతుల్లో(2024)

Champions Trophy 2025 : పాకిస్తాన్‌కి దబిడి దిబిడే.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు వీళ్లే అంటున్న పాంటింగ్..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 12 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ (102), శివ‌మ్ దూబె (14) లు క్రీజులో ఉన్నారు.