కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు సానియా మీర్జా ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
Sania Mirza: ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అందరినీ ఆశ్చర్యపర్చుతూ జనవరి 20న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన మూడవ పెళ్లికి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్ వివాహ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.
మొన్నటికి మొన్న భారత క్రికెటర్ మహ్మద్ షమీతో నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో పుకార్లు లేపారు.. తర్వాత ఇది పూర్తిగా అవాస్తవమని తేలింది. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘మెటా’ 2023లో నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న సానియా మీర్జా, ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ‘అంకితా సహిగల్’ కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటి అని అడగ్గా ఆమె సమాధానం ఇచ్చింది.
‘మీరు మీలాగానే ఉండండి, ఎవ్వరికోసం కూడా మారడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే మీరు మీలాగానే ప్రేమించబడ్డారు.. అలాగే ప్రేమించబడాలి’ అని సానియా మీర్జా చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సానియా మీర్జా అసాధారణ ప్రతిభతో టెన్నిస్ లో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016లో మార్టినా హింగిస్‌తో కలిసి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించి మొదటి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్, ఒలింపిక్ పతకం సాధించింది ఆమె.
View this post on Instagram