Team India Players: ‘వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయమని టీమిండియాకు చెప్పా’
ఇండియన్ క్రికెట్ టీం.. బోలెడ్ సిరీస్ లు, టోర్నమెంట్లు సంవత్సరాల తరబడి గెలుచుకున్న మాట వాస్తవమే. కానీ, వరల్డ్ కప్ టోర్నీ అంటే కాస్త ఒత్తిడితో కూడుకున్న పనే కదా.

World Cup
Team India Players: : ఇండియన్ క్రికెట్ టీం.. బోలెడ్ సిరీస్ లు, టోర్నమెంట్లు సంవత్సరాల తరబడి గెలుచుకున్న మాట వాస్తవమే. కానీ, వరల్డ్ కప్ టోర్నీ అంటే కాస్త ఒత్తిడితో కూడుకున్న పనే కదా. అయినప్పటికీ 28సంవత్సరాల తర్వాత ధోనీ కెప్టెన్సీలో మాత్రమే ట్రోఫీని ముద్దాడగలిగింది టీమిండియా.
ఆ టైంలో భారీగా ఉన్న కాంపిటీషన్ ను ఎదుర్కోవడానికి ఫాలో అయిన రూల్స్ అంటూ డ్రెస్సింగ్ రూం కబుర్లు చాలానే చక్కర్లు కొట్టాయి. రీసెంట్ గా ఓ విషయాన్ని రివీల్ చేశారు అప్పటి టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్. తాను రాసిన ద బేర్‌ఫుట్ కోచ్ పుస్తకంలో.. టీమిండియా ప్లేయర్లకు మ్యాచ్ జరగడానికి ముందు సెక్స్ చేయమని చెప్పేవాడినని తెలిపారు.
అంతేకాకుండా 2009 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రిపరేషన్ సమయంలో.. టీమిండియా ప్లేయర్లకు సెక్స్ బెనిఫిట్స్ గురించి పూర్తి వివరాలతో నోట్స్ కూడా ఇచ్చానని చెప్పాడు. సెక్స్ వల్ల మీ పర్‌ఫార్మెన్స్ మెరుగవుతుందా.. అంటే అవును. అని అతను బుక్ రాసుకొచ్చాడు.