Afg vs Ind: ఆఫ్ఘనిస్తాన్‌తో ఆట అంత ఈజీ కాదు.. భారత్ గెలుస్తుందా? జట్ల అంచనా!
టీ20 ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతుంది.

India
Afghanistan vs India: టీ20 ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7గంటల 30నిమిషాలకు జరగనుంది.
ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవకుంటే టోర్నీ నుంచి అవుట్ అయిపోతుంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇప్పటి వరకు రెండు విజయాలు నమోదు చేసింది. సెమీఫైనల్‌కు చేరుకోవాలనే ఆశను భారత్ సజీవంగా ఉంచుకోవాలంటే మాత్రం.. ఈరోజు ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందే.
టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు మూడోసారి తలపడనున్నాయి. అంతకుముందు 2010 టీ20 వరల్డ్‌కప్, 2012 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. రెండు సార్లు కూడా టీమ్ ఇండియా విజయం సాధించింది. 2010లో ఆఫ్ఘనిస్తాన్ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పైనే అరంగేట్రం చేసింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత 2012లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా అందులో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2012 తర్వాత తొలిసారి ఈ ఫార్మాట్‌లో రెండు జట్లు తలపడబోతున్నాయి.
అయితే, ఈసారి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది. 9వ నెంబర్ వరకు ఆటగాళ్లు ఆడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు జట్టు ఆలౌట్ కాలేదు. ఓపెనర్ల శుభారంభంతో పాటు చివర్లో నబీ హిట్టింగ్ జట్టుకు బలంగా ఉంది. ఈ క్రమంలో జట్టును తక్కువ అంచనా వేయడం కష్టమే.
టీమ్ ఇండియా Probable XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
ఆఫ్ఘనిస్థాన్ Probable XI: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (wk), రహ్మానుల్లా గుర్బాజ్, ఉస్మాన్ ఘని, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ (c), గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్/ముజీబ్ ఉర్ రహమాన్ మరియు హమీద్-హసన్, నవీన్-హసన్ హక్