గంగూలీ కామెంట్: టెస్టుల్లో రాహుల్ బదులు ఓపెనర్‌గా..

గంగూలీ కామెంట్: టెస్టుల్లో రాహుల్ బదులు ఓపెనర్‌గా..

Updated On : September 5, 2019 / 8:56 AM IST

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా మూడు సిరీస్‌లు గెలిచి ముగించుకుంది కానీ, జట్టులో ఓపెనర్ల వైఫల్యం కూర్పులో తడబాటును బయటపెట్టింది. కేఎల్ రాహుల్ క్రీజులో కుదురుకోవడానికి తంటాలు పడ్డట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో టెస్టు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను తప్పిస్తే బాగుంటుందన్నట్లు సౌరవ్ గంగూలీ కామెంట్ చేశారు. 

ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ.. ఓపెనర్‌గా రాహుల్‌ను మార్చాలని సూచించాడు. కొద్ది రోజుల ముందే ఓపెనర్‌గా రోహిత్ శర్మను తీసుకోవాలని చెప్పాను. ఈ అవకాశం మరొక్కసారిస్తే అతను నిరూపించుకుంటాడనుకుంటున్నాను. మంచి ఆటగాడు కాబట్టి పరిస్థితులను బాగా అర్థం చేసుకోగలడు’ అని గంగూలీ వెల్లడించాడు. 

వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ తర్వాత టెస్టు ఫార్మాట్ అవకాశాల కోసం రోహిత్ ఎదురుచూస్తున్నాడు. రహానె, హనుమ విహారీలు జట్టులో త్వరగానే ఇమిడారు. మిడిలార్డర్‌లో సమస్య ఉందని అనుకోవడం లేదు. ఓపెనింగ్ లో మాత్రం ఇంకా మార్పులు చేయాలనుకుంటున్నా. మయాంక్ పర్వాలేదనిపించుకుంటున్నాడు కానీ, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నా. దాంతో పాటు రాహుల్‌తో జోడీ కుదరక చాలా ఇబ్బందులు పడుతున్నాడు’ అని గంగూలీ పేర్కొన్నాడు.