IND vs SA: సఫారీలపై టీమిండియా పోరు.., మ్యాచ్‌లు రద్దు చేసిన సౌతాఫ్రికా బోర్డు
టీమిండియాతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లపై ఒమిక్రాన్ భయం పెరిగిపోయింది. దీనిపై సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొన్ని మ్యాచ్ లు రద్దు చేసింది.

Cricket
IND vs SA: టీమిండియాతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లపై ఒమిక్రాన్ భయం పెరిగిపోయింది. దీనిపై సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొన్ని మ్యాచ్ లు రద్దు చేసింది. అందులో భాగంగా దేశీయంగా 4రోజులపాటు జరిగే మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు సీఎస్‌ఏ ప్రకటించింది. సఫారీ జట్టుతో భారత జట్టు 3 టెస్టులు, 3 వన్డేలు ఆడేందుకు వెళ్లింది.
‘డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 22వరకూ జరిగే డొమెస్టిక్ క్రికెట్‌లో డివిజన్ వన్ ఐదో రౌండ్ మ్యాచ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బయోబబుల్ వెలుపల మ్యాచ్‌లు జరుగుతున్నందున సేఫ్టీగా ఉంటుందని వాయిదా వేయాలనుకున్నాం’ అని సీఎస్‌ఏ అధికారి వెల్లడించారు.
వాయిదా పడిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను 2022లో ప్రకటిస్తామని తెలిపింది క్రికెట్ బోర్డు. భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలి టెస్టును డిసెంబర్ 26 (బాక్సింగ్ డే)న ఆడనున్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు బృందం దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టి ప్రాక్టీస్ లో పాల్గొంటుంది. ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విరాట్.. సఫారీల గడ్డపై తొలిసారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
…………………………… : ఏపీలో ఇంటింటికీ ఫీవర్ సర్వే..
తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30మధ్య జరగనుండగా, రెండో టెస్టు జనవరి 3 నుంచి 7వరకూ, ఆఖరి టెస్టు జనవరి 11 నుంచి జనవరి 15 వరకు జరుగుతుంది. జనవరి 19, జనవరి 21, జనవరి 23వ తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి.