రహానె తండ్రి అయ్యాడు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య రాధిక 

  • Publish Date - October 5, 2019 / 09:06 AM IST

టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె తండ్రి అయ్యాడు. అతడి భార్య రాధిక ధూపాకర్ శనివారం (అక్టోబర్ 5, 2019) రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతోంది. టెస్టు సిరీస్ మ్యాచ్ లో బిజీగా ఉన్న రహానెకు తాను తండ్రి అయినట్టు తీపు కబురు అందింది. ఆ విషయం తెలిసి రహానె ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. తోటి క్రీడాకారులతో కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. రహానె తన చిన్ననాటి స్నేహితురాలు రాధికాను 2014లో వివాహం చేసుకున్నాడు. తొలిసారి స్కూల్లో కలుసుకున్న సమయంలో వీరిద్దిరికి స్నేహం ఏర్పడింది. 

కొన్నాళ్లు చిన్ననాటి స్నేహాన్ని అలానే కొనసాగించారు. తమ తల్లిదండ్రులను కలిసి పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. దీంతో రహానె, రాధికల పెళ్లి నిశ్చయించారు.  రెహానెకు ఆడ పిల్ల పుట్టడంతో అతడి భారత మాజీ సహా ఆటగాడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. కొత్త తండ్రికి అభినందనలు అని భజ్జీ ట్వీట్ చేశాడు. ‘టౌన్‌లో కొత్త తండ్రికి అభినందనలు @ajinkyarahane88 తల్లీ, లిల్ యువరాణి బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచి అజ్జు.. పూర్తి జీవితం ప్రారంభమవుతుంది #fatherhood ఇదే పితృత్వం’ అని హర్భజన్ ట్వీట్ చేశాడు. 

ఆడ పిల్లకు తండ్రిగా మారిన లేటెస్ట్ క్రికెటర్లలో రహానె ఒకడు. ఇదివరకే ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, హనుమ విహారీ సహా క్రికెటర్లంతా ఆడపిల్లకు తండ్రి అయినవారిలో ఉన్నారు.  ప్రస్తుతం.. అజింక్యా రహానె.. టీమిండియా తరపున దక్షిణాఫ్రికాతో విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఆడుతున్నాడు. ప్రపంచ కప్ తర్వాత విండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ సమయంలో రహానె జట్టులోకి వచ్చాడు.