ICC T20 : ప్రమాదం నుంచి తప్పించుకున్న అంపైర్..వీడియో వైరల్

దుబాయ్ వేదికగా వెస్టిండీస్ తో సౌతాఫ్రికా జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో అంపైర్ గా అలీమ్ దార్ వ్యవహరిస్తున్నారు.

ICC T20 : ప్రమాదం నుంచి తప్పించుకున్న అంపైర్..వీడియో వైరల్

Icct20

Updated On : October 27, 2021 / 4:26 PM IST

ICC T20 Aleem Dar : క్రికెట్ లో ఎన్నో విశేషాలు, ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అంతేగాకుండా..కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రమాదవశాత్తు బంతి, బ్యాట్ తగలడం..ఇతరత్రా కారణాల వల్ల మైదానంలోనే క్రీడాకారులు కుప్పకూలిపోవడం చూస్తుంటాం. మరికొన్ని ఘటనల్లో తృటిలో తప్పించుకుంటారు కూడా.

Read More : Alcoholic Drink: పబ్‌కెళ్లి ఆల్కహాల్ ఆర్డర్ ఇచ్చిన యువతి.. మొహం కాల్చారు!!

టీ 20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 రౌండ్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్స్ మెన్ కొట్టిన భారీ షాట్ ఎదురుగా ఉన్న ఫీల్డ్ అంపైర్ కు తగిలేలా బంతి దూసుకొచ్చింది. కానీ..ఆయన తప్పించుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Read More : Yadadri : బంగారు తాపడం కోసం..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి విరాళం పంపిచొచ్చు

దుబాయ్ వేదికగా వెస్టిండీస్ తో సౌతాఫ్రికా జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో అంపైర్ గా అలీమ్ దార్ వ్యవహరిస్తున్నారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ ప్రిటోరియాస్ వేస్తున్నాడు. కీరన్ పొలార్డ్ బంతిని భారీ షాట్ గా మరల్చేందుకు ప్రయత్నించాడు. బంతి అంపైర్ అలీమ్ దార్ వైపు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమన అతను కిందకు పడిపోయాడు. నేరుగా లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ దుసాన్ చేతికి వెళ్లింది. చాలా వేగంగా..బౌలర్ ఎండ్ వైపు త్రో చేశాడు. అతి కూడా అంపైర్ వైపు దూసుకొచ్చింది. అలీమ్ మరోసారి తప్పించుకున్నాడు. తనకు ఏమీ కాలేదని నవ్వుతూ..పైకి లేచి నిల్చొన్నాడు. దీంతో ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు.