Amit Mishra: గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్ కోసం రూ.300 అడిగిన నెటిజెన్.. రూ.500 గూగుల్ పే చేసి ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన మాజీ క్రికెటర్
ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‌కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. అనంతరం ‘‘అయిపోయింది, మీ డేట్‌కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Amit Mishra hilariously transfers Rs 500 to a Twitter user who sought money to go on a date with girlfriend
Amit Mishra: సోషల్ మీడియాలో అభిమానులతో ఇతర నెటిజెన్లతో కొంత మంది సెలెబ్రిటీలు సరదాగా ఉంటారు. ఇందులో మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ఒకరు. జోకులతో, ఆసక్తికరమైన విశయాలతో తన ఫాలోవర్స్‌ని ఎప్పటికప్పుడు వినోదాన్ని అందిస్తుంటాడు మిశ్రా. అయితే తాజాగా ఒక నెటిజెన్ డబ్బులు అడిగితే వెంటనే రెస్పాండ్ అయి.. డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బులు పంపించాడు. డబ్బులు తీసుకున్న ఆ నెటిజెనే కాకుండా మిగతా వారిలో కూడా ఈ వార్త కాస్త ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు కాస్త క్యూరియాసిటీని పెంచింది.
ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‌కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. అనంతరం ‘‘అయిపోయింది, మీ డేట్‌కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Done, all the best for your date. ? https://t.co/KuH7afgnF8 pic.twitter.com/nkwZM4FM2u
— Amit Mishra (@MishiAmit) September 29, 2022