బాక్సింగ్‌లో చరిత్ర సృష్టించిన అమిత్ పంగాల్

బాక్సింగ్‌లో చరిత్ర సృష్టించిన అమిత్ పంగాల్

Updated On : September 21, 2019 / 3:43 PM IST

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో రజతం గెలుచుకున్న అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల బాక్సింగ్‌లో ఛాంపియన్ షిప్‌లో రజతం గెలుచుకున్న తొలి బాక్సర్‌గా నిలిచిన అమిత్ పంగాల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రష్యాలోని ఏక్తరిన్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్ ఈవెంట్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన షాకోబిదిన్ జోరొవ్ చేతిలో 0-5తేడాతో ఓటమికి గురయ్యాడు. 

ఎత్తుగా బలంగా ఉన్న షాకోబిదిన్‌ను ఓడించడం అమిత్‌కు కష్టమైంది. 2017ఆసియా ఛాంపియన్ షిప్‌లో కాంస్యం గెలుచుకున్న అమిత్‌కు ఈ పతకం అత్యున్నతంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఏడాదికి ముందు భారత్ కాంస్యం పతకం తప్పించి రెండు పతకాలను ఎప్పుడూ సాధించలేదు. 

ఇక 63 కేజీల విభాగంలో పోటీపడిన మనీష్ కౌశిక్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకానికి పరిమితమయ్యాడు. ఈ సారి పోటీ చేసిన 9 దేశాల్లో 78 పోటీ పడినప్పటికీ ఉజ్బెకిస్తాన్ మాత్రమే మాత్రమే నలుగురు బాక్సర్లతో ఫైనల్‌కు చేరుకుని టాప్‌లో ఒకటిగా నిలిచింది.